గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్యపరీక్షలు,హెల్త్ కార్డులు

గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారం, అనారోగ్యం బారిన పడకుండా నివారించేందుకు జనగామ కలెక్టర్ ‘దిక్సూచి’ కార్యక్రమం కింద వినూత్న కార్యక్రమం చేపట్టారు.

Update: 2025-10-27 13:04 GMT
విద్యార్థులకు వైద్యపరీక్షలు చేపిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా

నగామ జిల్లాలో గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం కలెక్టర్ రిజ్వాన్ బాషా వినూత్న కార్యక్రమం చేపట్టారు.పాఠశాల విద్యార్థుల విద్య, ఆరోగ్యంతో సమగ్ర అభివృద్ధి కోసం ‘దిక్చూచి’ కార్యక్రమాన్ని అమలు చేశారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని గుర్తించిన కలెక్టర్ గురుకుల పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు చేయించి వారికి హెల్త్ కార్డులను జారీ చేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నపుడే వారు విద్యలో రాణిస్తారని చెబుతూ జనగామ జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కార్డుల జారీని కలెక్టర్ ప్రారంభించారు.




 హెల్త్ కార్డు జారీకి ఏం పరీక్షలు చేస్తారంటే...

ప్రతీ విద్యార్థి ఎత్తు, బరువు, బీఎంఐ, రక్త నమూనా,రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, బ్లడ్ ప్రెషర్, పల్స్ రేట్, కంటి, ఈఎన్ టీ, గుండె, చర్మం, నాడీ, ఊపిరితిత్తుల పరిస్థితులు, 4 డీలలో లోపాలు, వ్యాధులు, బాలికలకు రుతుస్రావం, దీర్ఘకాలిక ఆరోగ్య ట్రాకింగ్ పై వైద్యులతో పరీక్షలు చేయించి వారికి హెల్త్ కార్డులను జారీ చేస్తున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రతీనెలా నిరంతరాయంగా ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన వారికి వైద్య సహాయం అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా వైద్యాధికారులను ఆదేశించారు.



 14,993 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

జనగామ జిల్లాలోని 39 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 14,993 మంది విద్యార్థులను దిక్చూచి కార్యక్రమం కింద వైద్య పరీక్షలు చేశారు. మరో 4,898 మంది విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేశామని జనగామ జిల్లా వైద్యాధికారులు చెప్పారు. విద్యార్థులకు వైద్యపరీక్షలు, హెల్త్ కార్డుల జారీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.కలెక్టర్ వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. వైద్యపరీక్షలు, హెల్త్ కార్డుల జారీపై విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు.


Tags:    

Similar News