పరువు నష్టం కేసులో నాగార్జున, కొండా సురేఖ గైర్హాజరుతో కేసు వాయిదా

వచ్చే విచారణకు హాజరౌతారని ఇరువురు న్యాయవాదుల పిటిషన్ అనుమతించిన కోర్టు;

Update: 2025-07-25 12:38 GMT

మంత్రి కొండా సురేఖపై హీరోనాగార్జున వేసిన పరువు నష్టం కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. తన కుమారుడైన నాగ చైతన్య సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని నాగార్జున గతంలో నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసు  శుక్రవారం విచారణకు  వచ్చింది. ప్రతివాది అయిన కొండాసురేఖ ఎగ్జామినేషన్ కోసం హాజరు కావల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ప్రతివాదితో బాటు పిటిషనర్ అయిన నాగార్జున కూడా విచారణకు గైర్హాజరయ్యారు పిటిషనర్, ప్రతివాదులకు సంబంధించిన న్యాయవాదులు తమ క్లయింట్లు వచ్చే విచారణకు హాజరవుతారని పిటిషన్లు వేయడంతో కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.

నాగ చైతన్య సమంత విడిపోవడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కారణమని కొండా సురేఖ గతంలో బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ లో ఆరోపించారు. మరో మీడియా సమావేశంలో విడాకుల కోసం సమంతపై నాగార్జున ఒత్తిడి తెచ్చినట్లు   విమ ర్శించారు. కొండా సురేఖపై నాగార్జున, కెటీఆర్ వేర్వేరుగా పరువు నష్టం దావాలు నాంపల్లి కోర్టులో వేశారు.

Tags:    

Similar News