18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు సారె
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం వెల్లడి
హుస్నాబాద్ నియోజనవర్గంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్ లో ’మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి‘ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు బొట్టు పెట్టి ఈ చీరలను మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు.‘‘తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ సారే పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది’’ అని మంత్రి తెలిపారు. సిరిసిల్ల లో తయారైన ఈ చీరలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ఈ చీరలు పంపిణీ చేయాలని మంత్రి మహిళా సంఘాలకు సూచించారు.
.
కాంగ్రెస్ హాయంలో వడ్డీ లేని రుణాలు
మహిళలందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలని వారి ఆశీర్వాదం తమకు ఉండాలని ఆయన అన్నారు. 10 సంవత్సరాలుగా మహిళలకు వడ్డీలేని రుణాలు లేవని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ లు , పెట్రోల్ బంకులు , బస్సులు వంటి పథకాలు అమలు చేస్తున్నామని పొన్నం చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మహిళల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం అని ఆయన అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, విద్యార్థుల యూనిఫారామ్ కుట్టడం, అమ్మ ఆదర్శ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు మహిళల ద్వారానే కల్పిస్తున్నామని పొన్నం తెలిపారు
ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి
‘‘ఈ మధ్య ఇంటింటికి సర్వే చేశాం అందులో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే డబ్బు ,కులం, మతం ఇవేమి కాదు ఎవరైతే గొప్పగా చదువుకున్నారో ఆ కుటుంబాలు ఉన్నత స్థానాలకు వెళ్ళినట్లు తెలిసింది ’’ అని మంత్రి చెప్పారు. చదువుకుంటేనే అవకాశాలు వస్తాయి, అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు వెళ్తాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మీ పిల్లలను ఉన్నతచదువులు చదివించాలని, మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే విజయాలు సాధ్యం అవుతాయి అని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మహిళలకు పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు.
నియోజకవర్గానికి 3, 500 ఇందిరమ్మ ఇళ్లు
‘‘నియోజకవర్గంకి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అవన్నీ చివరి దశ నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు . తరువాత మరో 3500 ఇందిరమ్మ ఇళ్లు అవే వస్తాయి అని పొన్నం అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రజాపాలనలోనే సాధ్యమైందని అన్నారు. నూతన రేషన్ కార్డులు ఇచ్చామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని గుర్తుచేశారు. 200 యూనిట్ల ఉచాత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థలం ఉన్నవారికి, మహిళా సంఘాలకు భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తాం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 9 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.