మంత్రి సీతక్క సీరియస్
జువైనల్ ఘటనపై ఇద్దరు సూపర్ వైజర్లపై వేటు, సూపరిండెంట్ కు మెమో;
సైదాబాద్ జువనైల్ హోం నుంచి వరుసగా బాలలు తప్పించుకున్న ఘటనల పట్ల మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఈ మధ్య ఐదుగురు బాలలు పారిపోవడం పట్ల మంత్రి శుక్రవారం స్పందించారు. ఈ ఘటనలో విధుల పట్ల నిర్లక్షం వహించిన ఉద్యోగ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ఇద్దరు సూపర్ వైజర్లను విధుల్లో నుంచి తొలగించారు. సూపరిండెంట్ కు మాత్రం మెమో జారీ చేశారు. జువనైల్ హోం నుంచి బాలలు తప్పించుకోవడానికి సిబ్బంది కొరత అని మంత్రి దృష్టికి వచ్చింది.అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా ఆదేశాలు జారి చేశారు.
మంగళవారం రాత్రి జువనైల్ హోం నుంచి ఐదుగురు బాలలు సిబ్బంది కళ్లు గప్పిపారిపోయారు. అయితే రెండు రోజుల తర్వాత అంటే గురువారం ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇవ్వాళ సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జువనైల్ వెల్ఫెర్ అధికారులు నివేదిక సమర్పించారు. జువనైల్ వెల్ఫెర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చార్వాక్, అసిస్టెంట్ చీఫ్ ప్రోబేషన్ సుపర్వైజర్ నవీన్ ఘటనకు సంబంధించిన మంత్రికి వివరించారు. తప్పించుకుపోయిన ఐదుగురు బాలల్లో ముగ్గురు ఆచూకి లభించిందని వాళ్లు వివరించారు. మిగిలిన ఇద్దరు బాలల ఆచూకి కనుక్కునేందుకు పోలీసుల సహయం తీసుకుంటున్నామని మంత్రికి అధికారులు తెలిపారు.