‘కాంగ్రెస్‌‌ది బీఆర్ఎస్‌లా మతలబు ప్రభుత్వం కాదు’

గత సర్కార్‌లా తమ ప్రభుత్వ అడ్డగోలు జీవోలు ఇవ్వడం లేదన్న మంత్రి శ్రీధర్ బాబు.

Update: 2025-11-21 12:19 GMT

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. పదేళ్లు మంత్రి పదవిలో ఉన్న కేటీఆర్‌కు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలియట్లేదంటూ చురకలంటించారు. తమ ప్రభుత్వం గత ప్రభుత్వంలా అడ్డగోలు జీవోలు జారీ చేయడాలు, ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేయడాలు చేయట్లేదని, అందువల్లే కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాస్వామ్యబద్దమైన పాలన వాళ్లకి అర్థం కావడంలేదంటూ చురకలంటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రతి పని వెనక మతలబు ఉండేదని, కానీ తమ ప్రభుత్వం పారదర్శకతతో ముందుకు వెళ్తోందని అన్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలపై కేటీఆర్ చేసిన వ్ాయఖ్యలను ఆయన ఖండించారు.

‘‘కేటీఆర్.. దాదాపు 9,300 ఎకరాల భూమి గురించి మాట్లాడారు. పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం మా ప్రభుత్వం భూములకు తక్కువ ధరకు అందిస్తుంది. గత ప్రభుత్వం 2023లో మూడు ీవోలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. హైదరాబాద్‌లోని భూములను ట్రాన్స్‌ఫర్‌కు అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్లు వచ్చి ప్రభుత్వ భూములు అమ్ముకోవడం గురించి మాట్లాడుతున్నారు. ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజ్‌కు లేదా లేదన్నట్లు కేటీఆర్ మాట్లాడారు. 2023లో బీఆర్ఎస్ ఏ జీవోలు జారీ చేసిందో వాటి ప్రకారమే మేము కూడా భూములు ఇస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

‘‘పరిశ్రమలకు ఉపయోగపడాలని గ్రిడ్ పాలసీ తీసుకున్నారేమో అనుకున్నాం. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులకు గురిచేయకూడదు. రాష్ట్రానికి పెట్టబడులు రావాలని రాయితీలతో పాలసీలు తీసుకుంటాం. కొన్ని రాష్ట్రాల్లో భూములను రూ.99పైసలకే ఇస్తున్నారు. పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేదే మా లక్ష్యం. ఫ్రీహోల్డ్ ల్యాండ్ ఉన్నవాళ్లు పాలసీ ప్రకారం అవకాశం ఉంటే దరఖాస్తు చేసుకుంటారు’’ అని తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా గాలికి ఆరోపణలు చేయడం అనవసరమని హితవు పలికారు. చెప్తున్న భూ కుంభకోణం గురించి నిజమైన సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని, తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News