Mohammed Siraj | సిరాజ్ ను అభినందించిన అసదుద్దీన్ ఓవైసీ

సిరాజ్ హైదరాబాద్(Hyderabad) కు చెందిన ప్లేయర్ కావటంతో చాలామందికి అతనితో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి;

Update: 2025-08-07 11:48 GMT
Asaduddin Owaisi prized Mohammed Siraj

ఇంగ్లాండ్(England) తో జరిగిన 5వ టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా(India) గెలుపులో కీలకపాత్ర పోషించిన బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) ను హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ(Hyderabad MP Asaduddin Owaisi) అభినందించారు. సిరాజ్ హైదరాబాద్(Hyderabad) కు చెందిన ప్లేయర్ కావటంతో చాలామందికి అతనితో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇందులో భాగంగానే సిరాజ్ ను(IND Vs ENG 5Th Test) ఉద్దేశించి ఓవైసీ ప్రశంస్తు ట్వీట్ చేశారు. ‘‘ఎల్లపుడూ విజేతే..మన హైదరాబాద్ శైలిలో చెప్పాలంటే పూరా ఖోలో దియే పాషా’’ అని అభినందించారు. ఓవైసీ అభినందనలకు సిరాజ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ‘‘ధన్యవాదలు సార్..ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తు చీర్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు’’ అని హర్ట్ సింబల్ తో ట్విట్టర్లో స్పందించారు.

ఓవల్ లో జరిగిన చివరి టెస్టులో సిరాజ్ 9 వికెట్లు తీసుకుని జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఓటమిఖాయం అని అందరు అనుకుంటున్న టెస్టును తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యంతో ఇండియాను అనూహ్యరీతిలో సిరాజ్ గెలిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఐసీసీ విడుదలచేసిన తాజా ర్యాకింగ్స్ తో 674 పాయింట్లతో సిరాజ్ 15వ స్ధానంలో నిలిచాడు. ఇంగ్లాండు టెస్టుసీరిస్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ ను అభిమానులు పెద్దసంఖ్యలో శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతించారు.

టెస్టు సీరీస్ లో సిరాజ్ 23 వికెట్లు తీసి హైయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. సిరాజ్ ను ప్రత్యేకంగా సన్మానించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. మరీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News