సంగారెడ్డి జిల్లాలో యువకుడి హత్య

బావిలో నుంచి వెలికితీశారు;

Update: 2025-07-13 12:59 GMT

సంగారెడ్డి జిల్లాలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మొహల్లా ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల తాజుద్దీన్ హత్యకు గురవ్వడం స్థానికంగా సంచలనమైంది. నాగుల కట్ట మసీదు నుంచి ఇద్దరు యువకులు బైక్ పై తాజుద్దీన్ ను ఎక్కించుకునిపోయారు. తాజుద్దీన్ ను హత్య చేసి బావిలో పడేశారు. ఆదివారం తాజుద్దీన్ మృత దేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. తాజుద్దీన్ ను బైక్ పై ఎక్కించుకున్న యువకులు తీసుకెళుతున్న దృశ్యాలు సిసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

Tags:    

Similar News