నా కోర్కెలు తీర్చడం లేదు: భవిష్యవాణిలో మాతంగి అసంతృప్తి

నాకు కోపం వస్తే రక్తం కక్కుకుంటారు;

Update: 2025-07-14 07:43 GMT

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ(లష్కర్ అమ్మవారి) దేవాలయంలో సోమవారం రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలు పండుగ మరుసటి రోజే రంగం కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. రంగం కార్యక్రమంలో ప్రధాన ఘట్టం భవిష్య వాణి. ఈ వేడుకను చూడటానికి తెలుగు రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. ఈ ఏడు వానలు సమృద్దిగా కురుస్తాయని మాతంగి భవిష్యవాణిలో చెప్పారు. తాను శాంతంగా ఉన్నానని ఒకవేళ తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారని మాతంగి అన్నారు. అమ్మవారి కుండపై నిలబడి మాతంగి భవిష్యవాణి వినిపించారు. నాకు భక్తులు సమర్పించిన బోనాలును సంతోషంగా స్వీకరించాను. ప్రతీ ఏడాది ఏదో అడ్డంకులు కలుగుతున్నాయి. నేను చెప్పినట్టు చేయడం లేదు. నేను చెప్పిన కోర్కెలను నెరవేర్చడం లేదు. ఏ ఏడాదికా ఏడాది దాటవేస్తున్నారు. నా బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా. నేను కోపం ప్రదర్శించడం లేదు. నా కోపం వల్ల అనర్థాలు జరుగుతాయి. మరణాల సంఖ్య అందుకే పెరిగింది. కాలం తీరిందంటే ఏది జరగాలో అది జరుగుతుంది.



నాకు రక్తం బలి ఇవ్వడంలేదు

నాకు మాత్రం రక్తం బలి ఇవ్వడం లేదు. మీరుమాత్రం ఆరగిస్తున్నారు. ఈ ఏడాది ఇవ్వకపోతే ఎవరెవరు అడ్డొస్తారో వాళ్లు రక్తం కక్కుకుని చస్తారు అని మాతంగి స్వర్ణలత హెచ్చరించారు.

నాకు సక్రమంగా పూజలు నిర్వహించండి విధి విధానాలను తప్పకుండా పాటించాలి మాతంగి ఆదేశించారు. మాతంగి అగ్రహంతో ఉండడంతో ఆలయ పూజారు లు ఇక నుంచి సక్రమంగా పూజలు నిర్వహిస్తామని వాగ్దానం చేశారు.

మహమ్మారి వెంటాడుతుంది

రాబోయే రోజుల్లో భయంకర మహమ్మారి నా ప్రజలను వెంటాడుతుంది. అందరు అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. నేను మాత్రం నా ప్రజలను కాపాడుకుంటా. అది నా బాధ్యత కూడా. వానలు బాగానే పడతాయి. పాడి పంట కాపాడుకుంటా అని మాతంగి చెప్పారు. నా రూపాన్ని పెట్టడానికి ముందుకురావడం లేదు. నాకు పూజలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.


Tags:    

Similar News