Nirmal | కలెక్టర్ క్యాంప్ క్లర్క్ మహిళతో రాసలీలలు,బదిలీ వేటు

కలెక్టరు క్యాంప్ క్లర్క్ ఓ మహిళతో రాసలీలలు జరిపిన ఘటన నిర్మల్‌లో వెలుగుచూసింది. రాసలీలల బండారం బయటపడటంతో అతనిపై నిర్మల్ కలెక్టర్ అభిలాషా బదిలీ వేటు వేశారు.;

Update: 2025-02-02 02:03 GMT

నిర్మల్ కలెక్టరు కార్యాలయంలో క్యాంప్ క్లర్కుగా పనిచేస్తున్న ఉద్యోగి రాకేష్ నిర్మల్ పట్టణ శివారులోని ఎల్లపల్లిలోని ఓ ఇంట్లో మహిళతో రహస్యంగా రాసలీలలు సాగించారు. కొత్త వెంచరులోని నివాస గృహంలో కలెక్టర్ క్యాంప్ క్లర్కు రాసలీలలాడుతున్నారని పోలీసు డయల్ 100కు ఆగంతకులు సమాచారం అందించారు. అంతే ఈ ఫిర్యాదుతో నిర్మల్ రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న క్యాంప్ క్కర్కు మహిళను గది లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు. క్యాంప్ క్లర్కు రాసలీలల బండారం, మహిళ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


మహిళను విచారించిన పోలీసులు
పోలీసులు తాళం పగులగొట్టి కలెక్టర్ క్యాంప్ క్లర్కు రాకేష్ తో రాసలీలల్లో పాల్గొన్న మహిళను బయటకు తీసుకువచ్చారు.పోలీసులు సదరు మహిళను సఖీ సెంటరుకు తరలించి ఆమెను విచారించారు. క్యాంప్ క్లర్కు ఘటన జరిగిన రోజు కార్యాలయానికి రాలేదని, రాసలీలలకు పాల్పడ్డాడని తేలింది. క్యాంప్ క్లర్కుతో తనకు కొంత కాలంగా స్నేహం ఉందని మహిళ పోలీసులకు చెప్పింది. క్యాంప్ క్లర్కు రాసలీలల వ్యవహారం వాస్తవమేనని పోలీసుల విచారణలో తేలింది.దీంతో పోలీసులు ఇంటిని సీజ్ చేశారు.

క్యాంప్ క్లర్కుపై కలెక్టర్ బదిలీ వేటు
మహిళతో రాసలీలల్లో పాల్గొన్న క్యాంప్ క్లర్కు రాకేష్ పై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్ బదిలీ వేటు వేశారు. క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన ఉద్యోగి దుష్ఫ్రవర్తనకు పాల్పడినట్లు తేలితే అతని పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాషా అభినవ్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,దుష్ప్రవర్తనకు పాల్పడి పరిపాలన యంత్రాంగానికి చెడ్డపేరు తీసుకురావద్దని కలెక్టర్ ఉద్యోగులను కోరారు.


Tags:    

Similar News