సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి వచ్చిన నిర్మల్ వాసి
ఉపాధి కోసం కువైట్ దేశానికి వెళ్లి, ఒంటెల కాపరిగా ఏడారిలో కష్టాలు పడిన నిర్మల్ జిల్లా వాసి రాథోడ్ నాందేవ్ సీఎం చొరవతో క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.
కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ.రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ లతో పాటు గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్ తన కుటుంబ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురై రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్న నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ గారు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తన వేదనను తెలియజేస్తూ నాందేవ్… pic.twitter.com/tFJObsmRpw
— Telangana CMO (@TelanganaCMO) October 5, 2024