బీహార్ ఎన్నికలపై మజ్లిస్ ఫోకస్
మహా ఘట్ బంధన్ తో చర్చలు;
By : B Srinivasa Chary
Update: 2025-06-30 11:28 GMT
ఈ ఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి, ఎన్ డిఎ కూటమి అభ్యర్థులను ఓడించడానికి మజ్లిస్ పార్టీ సమాయత్తమైంది. ఒకప్పుడు కేవలం పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి నిర్ణయించింది. బిజెపి, ఎన్ డిఏ లను నిలు వరించేందుకు మజ్లిస్ కాంగ్రెస్ లతో చేతులు కలిపింది. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపింది.
మహా ఘట్ బంధన్ తో చర్చలు
మా పార్టీ మహా ఘట్ బంధన్ తో చర్చలు జరుపుతోంది. నవంబర్ లో బీహార్ లో ఎన్నికలున్నాయి. బిజెపిని మళ్లీ అధికారంలో రాకుండా చేయడమే మా ఉద్దేశ్యం. మాపార్టీ బీహార్ అధ్యక్షుడు అక్తర్ ఉల్ ఇమాన్ మహాఘట్ బంధన్ తో చర్చలు జరుపుతున్నారు. ఎన్ డిఏ వ్యతిరేక కూటములతో కల్సి పని చేస్తామని ఓవైసీ అన్నారు.