ఖర్చు ఎక్కువని అప్పట్లో ఆదేశం పై దాడి చేయలేదు.. విదేశాంగమంత్రి

ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు భారత్ ప్రతిదాడి ఎందుకు చేయలేదో భారత విదేశాంగ శాఖ మంత్రి వివరించారు. అప్పటి ఎన్ఎస్ఏ రాసిన నోట్ ను ప్రజలకు వివరించారు.

Update: 2024-04-24 08:00 GMT

ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు యూపీఏ ప్రభుత్వం ‘ఏమి చేయకూడదు’ అని నిర్ణయించుకుందని భారత విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. అప్పటి జాతీయ భద్రతా సలహదారు దీని గురించి స్వయంగా ఓ నోట్ రాసినట్లు వివరించారు. "మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. అన్ని ప్రాధాన్యాలను పరిశీలించాం. తరువాత ఎలాంటి ప్రతిస్పందన చేయకూడదు అని నిర్ణయానికొచ్చాం.  పాకిస్తాన్ ఇప్పుడు దాడి చేసినదానికంటే.. మనం దాడి చేస్తే ఖర్చు ఎక్కువ.. కాబట్టి ఏమి చేయద్దు" అని నిర్ణయం తీసుకున్నారని జై శంకర్ వివరించారు. నేనేమీ తీర్పు చెప్పడం లేదు. అప్పుడు జరిగింది మీ ముందు పెట్టాను. మీరు ఆలోచించాలని చెప్పారు.

భారతదేశాన్ని 'గ్లోబల్ సౌత్' (సుమారు 125 దేశాలతో కూడిన) వాయిస్‌గా అభివర్ణించిన ఆయన, గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచంలో ఏ దేశాన్ని అయినా నమ్ముతున్నాయంటే అది భారత్ అని చెప్పారు.
'ఫారెన్ పాలసీ, ఇండియా వే, డిఫిడెన్స్ టూ కాన్ఫిడెన్స్’ అనే అంశంపై తెలంగాణలో జరిగిన కాంక్లేవ్ లో ఆయన ప్రసంగించారు. వలసపాలనలో ఉండి, ఇప్పటికి కోలుకోలేని దేశాల పునర్ నిర్మాణానికి భారత్ అండగా నిలబడుతుందని చెప్పారు. ఇప్పుడు ఇండియాలో అదే జరుగుతోందని వివరించారు.
"మేము గ్లోబల్ సౌత్ వాయిస్, ఇందులో ప్రపంచంలోని సుమారు 125 దేశాలు ఉన్నాయి. ఏదైన సాయం కావాలన్న, పని జరగాలన్నా ఇవన్నీ న్యూఢిల్లీ వైపే చూస్తున్నాయి. ఈ దేశాలు భారతదేశాన్ని విశ్వసిస్తున్నాయి" అని ఆయన అన్నారు. సరిహద్దుల్లో భారత్‌కు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని రక్షించుకోవడానికే సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, సైన్యానికి మద్ధతునివ్వడం, అలాగే సరిహద్దులో ఏదైన సమస్య తలెత్తిన వెంటనే వేగంగా స్పందించే వ్యవస్థను రూపొందిస్తున్నామని అన్నారు. గత యూపీఏ హాయాంలో ఉగ్రవాదాన్ని అంగీకరించారని విమర్శించారు.
భారత " విదేశాంగ విధానం "అభిమానం" నుంచి విశ్వాసానికి ఎలా మారిందనే అంశం గురించి మాట్లాడుతూ, "మేము ఆ నియంత్రణ రేఖను దాటినప్పుడే.. మనం వైవిధ్యం నుంచి విశ్వాసానికి మారాము. అదే పనిని మరోసారి చేసి ఈసారి మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోదీ చేసుకున్నాం". అని బాలాకోట్ దాడి విషయాన్ని ప్రస్తావించారు.
ఇంతకుముందు ప్రభుత్వాలు, అమెరికాతో వ్యవహరాలు నడిపేసమయంలో కొంచెం బెరుకుగా ఉండేవని, ఇప్పుడు మా ప్రభుత్వం నమ్మకం, ధృడత్వంతో వ్యవహరిస్తోందని అన్నారు. ఫిలిప్పీన్స్ తర్వాత దేశం ఇతర దేశాలకు కూడా బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేస్తుందా అని అడిగిన ప్రశ్నకు, మేక్ ఇన్ ఇండియా, ఎంతటి ప్రాచుర్యాన్ని పొందిందో ఇదో మంచి ఉదాహరణ అని కొనియాడారు.
" బ్రహ్మోస్ మాత్రమే కాదు. ఇది ఇతర పరికరాలు కూడా ఎగుమతి చేయవచ్చని అన్నారు. ఇది భారత్ ప్రవేశిస్తున్న కొత్త మార్గమని నేను భావిస్తున్నాను. (PM) మోదీ జీ మన రక్షణ ఉత్పత్తిదారులను చాలా బలంగా ప్రోత్సహిస్తున్నారు, మన అవసరాలు తీరడంతో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి, మన రక్షణ ఎగుమతులు పెరుగుతాయని నాకు చాలా నమ్మకం ఉంది" అని ఆయన అన్నారు.

Tags:    

Similar News