ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న పవన్ కల్యాణ్
దేవాలయాల బాట పట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు.కుంభమేళా నుంచి వచ్చిన పవన్ అపోలోలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.;
By : The Federal
Update: 2025-02-23 01:24 GMT
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రాత్రి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అపోలో వైద్యులు పవన్ కల్యాణ్ గారు శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పలు పరీక్షలు చేశారు.వైద్యులు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పవన్ కు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని చెప్పారు.
పవన్ కల్యాణ్ వైద్యుల సూచనల మేరకు ఫిబ్రవరి నెలాఖరునగానీ, లేదా మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలను చేయించుకుంటారని జనసేన పార్టీ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మొదలయ్యే ఏపీ బడ్జెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతారని జనసేన పార్టీ తెలిపింది. పవన్ కల్యాణ్ చేపట్టిన దేవాలయాల సందర్శన కార్యక్రమం కుంభమేళాతో ముగిసింది.