మరొకరి వీర్యంతో గర్బం

టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో చీటింగ్;

Update: 2025-07-26 15:09 GMT

తమకు సంతానం కలగడం లేదని టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను ఆశ్రయించిన దంపతులను సికింద్రాబాద్ లో ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చీటింగ్ చేసింది. ఏడేళ్లుగా తమకు పిల్లలు కలగడం లేదని దంపతులిద్దరు టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను ఆశ్రయించారు. ఐవిఎఫ్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనివ్వొచ్చని డాక్టర్లు దంపతులకు సూచించారు. వైఫల్యం శాతం సున్నా అని దంపతులకు డాక్టర్లు చెప్పారు. ఏడేళ్లుగా పిల్లలు లేని ఆ దంపతులు సంతోషించి టెస్ట్ ట్యూబ్ సెంబర్ అడిగిన డబ్బును కట్టేసి ఇంటికి వెళ్లిపోయారు. ఐవిఎఫ్ కోసం దంపతులిద్దరు ఒక రోజు టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు వచ్చారు. భర్త వీర్యాన్ని ఇచ్చారు. ఆ వీర్యం భార్యకు ఇవ్వకుండా మరొకరి వీర్యం ఇచ్చింది టెస్ట్ ట్యూబ్ సెంటర్. ఈ విషయాన్ని దంపతులకు చెప్పలేదు. కొద్ది రోజుల్లోనే ఆమె గర్బం దాల్చింది. సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. కొద్ది రోజుల్లోనే ఐవిఎఫ్ చేయించుకున్న ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఆ బిడ్డ తరచూ అనారోగ్యానికి గురవడంతో ఆ దంపతులు వైద్య పరీక్షలు చేయించారు. బిడ్డకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు తేలింది. ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ లేదు. అయినప్పటికీ బిడ్డకు క్యాన్సర్ అని రిపోర్ట్ రావడంతో ఆ దంపతులు టెస్ట్ ట్యూబ్ సెంటర్ దగ్గరికొచ్చి నిలదీశారు. టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో దంపతులకు అనుమానమొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు డిఎన్ ఏ పరీక్షలు చేసుకున్నారు. డిఎన్ ఏ పరీక్షలు కూడా సరిపోలేదు. దీంతో టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంతానం కోసం వచ్చిన దంపతులను ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ గత కొన్ని సంవత్సరాలుగా మోసం చేస్తూ వస్తోంది అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Tags:    

Similar News