‘పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము’

ఏదైనా సాదించాలి అంటే నిర్మాతల వల్లనే అవుతుంది.;

Update: 2025-05-26 11:54 GMT

సింగిల్ థియేటర్లు, సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఇలా సినీ ఇండస్ట్రీలో ఉన్న అనేక సమస్యలపై స్పందించడం కోసం ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోమవారం కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇటీవల సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు పెట్టిన ప్రెస్‌మీట్ కీలకంగా మారింది. నైజాంలో మొత్తం 370 సింగిల్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్, తమకు కేవలం 30 మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. కొందరు మాత్రం నైజాంలో అత్యధిక థియేటర్లు తమకే ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది కాబట్టే ఈ ప్రెస్‌మీట్ పెట్టినట్లు కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ సమావేశం స్టార్ట్ అవుతూనే విలేకరులకు ఆయన కీలక సూచన చేశారు. ప్రతి ఒక్కరూ కూడా టాపిక్‌కు సంబంధించే ప్రశ్నించాలని, విషయాన్ని పక్కదారి పట్టించేలా, వివాదం రేకెత్తించే లాంటి ప్రశ్నలు అడగొద్దని కోరారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇండస్ట్రీకి పెద్దన్నయ్య లాంటిదని దిల్ రాజు చెప్పారు. ‘‘తెలంగాణ, ఏపీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తమకు పెద్దన్నయ్య లాంటిది. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాలే పరిష్కరించాలి. ఈ ఎపిసోడ్‌తో ఇప్పటికైనా తెర దించుదాం. నెల 30 తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్‌లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తాం. ఈ మేరకు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము’’ అని తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ సినిమాలు ఆపడం అన్న విషయంపై ఘాటుగా స్పందించారు. అంత దమ్ము ఎవరికి ఉందని ప్రశ్నించారు.

‘‘మే 18 న ఏపీ తెలంగాణ ఎగజిబిటర్స్ సమావేశం జరిగింది. థియేటర్స్ బంద్ అని కొంతమంది చెప్పి ఉంటారు. ఆ స్టేట్మెంట్ ఎవరూ అధికారికంగా చెప్పలేదు. ఛాంబర్ నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్స్.. సమావేశం జరిగింది.. వారు సమస్యకు పరిష్కారం చేస్తాం అన్నారు. ఆ రోజు అందరూ ఏకీభవించారు. బేస్ లేకుండా థియేటర్స్ బంద్ అని వేశారు... అప్పుడు ఎవరూ స్పందించలేదు. మా దాంట్లో అందరికీ సఖ్యత ఎవరూ ఏమంటారో అని భయం.. ఉన్నట్లు ఉంది. కోవిడ్ లో తప్పితే ఎప్పుడు థియేటర్స్ బందు చేయలేదు. ఏదైనా సాదించాలి అంటే నిర్మాతల వల్లనే అవుతుంది. బంద్ అంశం లేకుండా.. సమస్య పరిష్కారం చేయాలని అందరం నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి సమావేశం నిర్వహించాము. పవన్ కళ్యాణ్ సినిమా అంశం వచ్చింది. అప్ప్పుడు నా పై కూడా ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము దైర్యం ఎవరూ చేయరు’’ అని తెలిపారు.

Tags:    

Similar News