బిఆర్ ఎస్-బిజెపి విలీనం బేరం వాస్తవమా ? వ్యూహమా ?
బీఆర్‌ఎస్ భవితవ్యంపై నీలి మేఘాలు? ప్రమఖు మానసిక వైద్యులు డా. కేశవులు విశ్లేషన;
By : డాక్టర్ బి కేశవులు
Update: 2025-07-29 03:30 GMT
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా వెలుగొందిన భారత రాష్ట్ర సమితి (BRS), ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడే దశకు చేరిందన్నది ఒక వాస్తవం. తాజాగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు, రాజకీయ వర్గాల్లో చర్చలకు తావిచ్చాయి. ఈ విషయం వెనకున్న వ్యూహాలు ఏమిటి? ఇది నిజంగా బీఆర్ఎస్ తలచిన మార్గమా? లేక రాజకీయ ప్రత్యర్థుల ప్రణాళికా ప్రయోగమా? ఈ వ్యాసంలో విశ్లేషణాత్మకంగా వివరించే ప్రయత్నం ది ఫెడరల్ తెలంగాణ చేస్తున్నది.
ఉద్యమం నుంచి రాజకీయ వ్యూహాల దాకా...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీర్ఘకాలం పోరాడిన KCR నాయకత్వంలో 2001లో ప్రారంభించిన TRS (తర్వాత BRS), 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలిదశలో ప్రజల మద్దతుతో అధికారం చెలాయించిన BRS, 2018లో రెండోసారి గెలిచి తిరిగి అధికారం లోకి వచ్చింది. అయితే 2023 ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఓటమి పాలవడంతో ఆ పార్టీ భవిష్యత్తుపై అనేక సందేహాలు పుట్టుకొచ్చాయి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన పార్టీ ఒకవేళ ఇతర జాతీయ పార్టీలో విలీనమవుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా చర్చకు వస్తున్నాయి.
బీజేపీ ఎంపీ CM రమేష్ బాంబు..
ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ప్రకటన ఆ ఆరోపణలకు మరింత బలం ఇచ్చింది. ఆయన ప్రకారం, KTR నా ఇంటికి వచ్చి బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం చేయాలని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఈ ప్రకటనకు బీజేపీ నాయకత్వం కూడా పూర్తిగా మద్దతు తెలిపింది. అంటే, బీఆర్ఎస్ వర్గాల్లో కనీసం కొంతమంది నాయకులు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని స్పష్టత ఏర్పడుతోంది. బండి సంజయ్ ఒకవైపు ఈ విషయంపై చాలెంజ్ కూడా విసిరారు. కానీ టిఆర్ఎస్ నాయకత్వం దీనిపై పెద్దగా స్పందించడం లేదు.
మేము విలీనమవ్వం...
KTR ఈ ఆరోపణల్ని తిప్పి కొట్టారు. తమ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని కేవలం రాజకీయం కోసం బూటకపు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు.అయితే ఈ వివరణలో ప్రజలకు స్పష్టత రాకపోవడం, మరింత అనుమానాలకు తావిస్తోంది.KTR మాట్లాడిన కొన్ని ముఖ్యాంశాలు,BRS ఒక ప్రాంతీయ పార్టీగా Telangana ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం.ఎవరితోనూ విలీనంపై చర్చలు జరగలేదని తేల్చిచెప్పారు.“మేము విలీనం కోసం వెళ్తే, KCR తన రాజకీయం మొత్తం వదిలేస్తాడు” అనే విధంగా గట్టిగా స్పందించారు.
కవిత vs కేటీఆర్ ...
అత్యంత సంచలనంగా మారిన విషయం, కవితా గారు చేసిన వ్యాఖ్యలు. ఆమె బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీజేపీలో విలీనానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు, తన అన్న KTR నాయకత్వానికి వ్యతిరేకంగా ఆమె విమర్శలు చేయడం, ఇంటి సమస్య బహిరంగంగా మారినట్లైంది. ఈ విమర్శలు రెండు విషయాలను స్పష్టత చేస్తాయి, ఒకటి బీఆర్‌ఎస్ లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి, రెండు ఈ విభేదాలు కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా మారేలా వివిధ దళాలు పనిచేస్తున్నాయన్న అనుమానం.
BRS బలహీనతలు ...
ఓటముల భయము,2023లో కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ నాయకత్వంలో అనేక అసంతృప్తులు తలెత్తాయి.ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో పార్టీ పూర్తిగా క్షీణించిపోవడం, కార్యకర్తల్లో నమ్మకం కోల్పోవడం కీలకమైన సంఘటనలు.ఈ పరిస్థితుల్లో బీజేపీలో విలీనమైతే ఆ నాయకులకు పునాది దొరుకుతుందనే భావన ఉన్నవారిలో ఉండవచ్చు.Kaleshwaram Lift Project అవినీతి, Delhi Liquor Scam లో కవితపై CBI విచారణ.TSPSC లీక్ స్కాంలు, ఈ కేసులన్నీ బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి సంస్థల దాడులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కేంద్రంతో గుట్టుగా ఒప్పందం అనే అపోహలు ప్రజల్లో విస్తరిస్తున్నాయి.
బీజేపీ వ్యూహం ...
బీజేపీకి తెలంగాణలో విస్తరణ అనేది కీలకమైన లక్ష్యం.బీఆర్ఎస్ బలహీనపడితే, దాని ఓటు బ్యాంక్ ను తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా విలీన ప్రస్తావనలు లీక్ చేయడం బీజేపీ వ్యూహంగా పరిశీలించవచ్చు. అంతేకాదు, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే విపక్షంగా బీఆర్ఎస్‌ను పూర్తిగా నాశనం చేయాలనే వ్యూహం బీజేపీకి ఉండే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్న పెరుగుతున్నది, ఇదీ కాదనలేని సత్యం. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ప్రజలు అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బి ఆర్ ఎస్ ప్రభుత్వాలను చూశారు, చావు బతుకులో ఉన్న బిఆర్ఎస్ ను దెబ్బ తీయడం ద్వారానే బిజెపి బలపడుతుందని, బీజేపీ అగ్ర నేతలు గట్టి విశ్వాసానికి వచ్చారు. మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినట్టయితే, డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడడం ద్వారా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఆశలు కల్పించడంలో బీజేపీ కొంతవరకు సఫలీకృతం అవుతున్నట్టు కనబడుతుంది.
విలీన వాస్తవం...
కొందరు BRS నాయకులకు రాజ్యసభ సీట్లు లేదా ప్రభుత్వ పదవులు దక్కవచ్చు.CBI/ED కేసుల్లో ఉపశమనం దొరకవచ్చు. కార్యకర్తల కొంతమందికి రాజకీయ భవిష్యత్తు పునఃప్రారంభం.Telangana ప్రజలు ఇచ్చిన మద్దతును పణంగా పెట్టడం. ఉద్యమ స్ఫూర్తిని తక్కువ చేయడం.కేంద్రానికి తలవంచకుండా ఉంటామన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కడం. తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ ఒక చిహ్నం.కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తన సత్యాన్ని మర్చితే – ప్రజలు మర్చిపోవచ్చు, కానీ చరిత్ర మాత్రం మర్చదు. విలీనాలు రాజకీయాలకు మార్గాలు కావచ్చు, కానీ ప్రజల విశ్వాసానికి అవి మచ్చలు అవుతాయి.బీఆర్‌ఎస్ – బీజేపీ విలీనం గానీ, రాజకీయ ఒప్పందం గానీ, తార్కికంగా చూస్తే ఇప్పటి వరకు అధికారికంగా లేదు. కానీ రాజకీయంగా జరిగే చర్చలు, చర్యలు, వాయిస్‌లు, లీక్‌లు — ఇవన్నీ ఆ దిశగా ఆలోచనలున్నాయన్నది స్పష్టమవుతోంది.
విలీనమే మార్గమైతే....
బీజేపీలో విలీనం తాత్కాలిక రక్షణ, దీర్ఘకాలికంగా నష్టం,పునర్నిర్మాణం అంతర్గత విభేదాలను పరిష్కరించాలి, క్షేత్రస్థాయిలో తిరిగి పోరాడాలి,నూతన నాయకత్వం కొత్త శక్తులు, యువతలో నమ్మకాన్ని పెంపొందించాలి, ప్రజల పక్షాన పోరాటం కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మళ్లీ ప్రారంభించాలి.ప్రజలు భావోద్వేగాలతో కాదు, చైతన్యంతో ఆలోచించాలి. ఒక పార్టీ ఉద్యమాల పుట్టుకతో ఏర్పడి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, మళ్లీ అధికారాన్ని పొందిన తర్వాత, ఓటమి ఎదురైనప్పుడు తలవంచే స్థాయికి దిగజారితే, అది క్షమించదగిన పని కాదు. “ఒక ఉద్యమ పార్టీ విలీనమే మార్గమైతే, ప్రజల ఆశలే విలీనమవుతాయి. మరెప్పుడూ ప్రజాస్వామ్యంపై నమ్మకం వుండదు. అది ప్రజల ఆశలపై పచ్చి మోసం...