AlluArjun attends Nampalli Court|కోర్టులో హాజరైన పుష్ప
అల్లుఅర్జున్ తరపున లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయటంతో కేసును విచారించిన కోర్టు పుష్పకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.
నాంపల్లి కోర్టులో అల్లుఅర్జున్ హాజరయ్యాడు. ఈనెల 13వ తేదీన అల్లుఅర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని సింగిల్ బెంచ్ అల్లుఅర్జున్(AlluArjun) కు ఇచ్చిన రిమాండును హీరో తరపు లాయర్లు హైకోర్టులో చాలెంజ్ చేశారు. కేసు పూర్వపరాలను విచారించిన హైకోర్టు అల్లుఅర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. సంధ్యా థియేటర్లో(Sandhya Theatre) పుష్ప సినిమా(Pushpa Movie) విడుదలసందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనేమహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ స్పృహతప్పి తర్వాత కోమాలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే తేజ్ కోమాలో నుండి బయటకువస్తున్నాడు. థియేటర్లో తొక్కిసలాటకు అల్లుఅర్జునే కారణమని ఆరోపించిన పోలీసులు కేసునమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్లో ప్రాధమిక విచారణ తర్వాత పుష్పను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
కేసును విచారించిన నాంపల్లికోర్టు(Nampalli Court) అల్లుఅర్జున్ కు 14 రోజుల రిమాండుకు విధించింది. పోలీసులు పుష్పను చంచల్ గూడ్ జైలుకు తరలించారు. అయితే అల్లుఅర్జున్ తరపున లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయటంతో కేసును విచారించిన కోర్టు పుష్పకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండును అల్లుఅర్జున్ అనుభవించనప్పటికీ సాంకేతికంగా కోర్టుకు హాజరవ్వాలన్న లాయర్ల సూచన ప్రకారమే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు.