తెలంగాణలో ఐదురోజుల పాటు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు;
తెలంగాణతో బుధ వారం నుంచి ఈ నెల 7 వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒరిస్సా దాటి భువనేశ్వర్ వైపు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో గంటకు 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బుధవారం తెలంగాణలో భారీ వర్షాలు లేనప్పటికీ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల ఏడో తేదీవరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూ పాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. భధ్రాది జిల్లా దమ్మపేటలో రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
నష్టపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద రూ.1.30 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ నగదును అధికారులు అందించనున్నారు.చనిపోయిన కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. పాడి పశువులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.4 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రఢుత్వం ముందుకు వచ్చింది. ఒక మేక లేదా ఒక గొర్రె మాత్రమే చనిపోతే వాటికి ఐదువేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. కామారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, సూర్యాపేట, భువనగిరి, నిజామాబాద్, అదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ములుగు, మహబూబ్‌నగర్ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు ఈ ఎక్స్‌గ్రేషియా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.