2025: హమారా 'హైదరాబాద్ ది గ్రేట్'
2025లో విశ్వమంతా గుర్తించిన విశిష్ట నగరం
By : పి. చైతన్య
Update: 2025-12-13 06:14 GMT
• 51 ప్రపంచ ప్రముఖ వాణిజ్య ప్రాతాలలో బంజారాహిల్స్, హిమాయత్ నగర్
• దేశంలోని 10 హై స్ట్రీట్‌ల జాబితాలో రెండవ స్థానంలో సోమాజిగూడ
• వివిధ అంతర్జాతీయ సంస్థల సర్వేలో వెల్లడి
హైదరాబాద్ బంజారా హిల్స్ మరియు హిమాయత్‌నగర్ (Himayat Nagar) లోని ప్రముఖ షాపింగ్ కారిడార్లు మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్- 2025నివేదిక యొక్క ఆసియా-పసిఫిక్ (APAC) ర్యాంకింగ్స్‌లో స్థానం పొంది నగరానికి ప్రపంచపటంలో మరో గుర్తింపుని తెచ్చాయి.
సర్వే గుర్తించిన 51 ప్రముఖ వాణిజ్య ప్రాతాలలో బంజారాహిల్స్(Banjara Hills), హిమాయత్ స్థానం పొందటం విశేషం. ఇది నగరాన్ని టోక్యో, సింగపూర్, హాంకాంగ్, న్యూఢిల్లీతో సమాన స్థాయిలో ఉంచటమే
పట్టణాలలోని వాణిజ్య ప్రాతాలలోని స్థలం అద్దెలను ప్రామాణికంగా తీసుకొని ఆ ప్రాతాలకు ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది. బంజారా హిల్స్ మరియు హిమాయత్‌నగర్‌లలో చదరపు అడుగుకు వార్షిక అద్దె RS 2,680 గా సర్వేలో గుర్తించారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 140 ప్రధాన షాపింగ్ వీధులను సర్వే చేసి సంస్థ నివేదికను తయారు చేసింది.
ఆసియా-పసిఫిక్ (APAC) ర్యాంకింగ్స్‌లో బంజారా హిల్స్ మరియు హిమాయత్‌నగర్ 48వ స్థానాన్ని పంచుకున్నాయి, బంజార హిల్స్, హిమాయత్ నగర్ లు జాబితాలో శాతం పొందటంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు అక్కడ తమ బ్రాంచ్ లను స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఇది ఆ ప్రాంత మరింత అభివృద్ధికి దారి తీయవచ్చు.
ఆసియా పసిఫిక్ ర్యాంకింగ్స్‌లో స్థానం తెలుగు రాష్ట్రాల నుండి పొందినది హైదరాబాద్ నగరం మాత్రమే నగరం. బంజారా హిల్స్ ప్రశాంతమైన, కేఫ్-లైన్డ్ వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సందర్శకులు బోటిక్‌లు మరియు ప్రముఖ షాప్ లను షాపింగ్ కు ఎక్కువ సమయం కేటాయిస్తారు అని సర్వే లో తేలింది.
హిమాయత్‌నగర్ లో ఆభరణాల, బేకరీలు, బుక్‌షాప్‌లు మరియు ఫ్యాషన్ అవుట్‌లెట్‌లు కేంద్రీకృతం అయ్యి ఉన్నాయి. వ్యాపారుల ప్రకారం ముంబై , బెంగళూరులోకి ప్రవేశించే ముందు హైదరాబాద్ మిడ్-లగ్జరీ బ్రాండ్‌లకు రెండు కారిడార్లు మొదటి ల్యాండింగ్ స్పాట్‌లుగా మారాయని గుర్తించారు.
మరొక సర్వే ప్రకారం, హైదరాబాద్‌లోని ఐదు ప్రధాన వీధులు (Mainstreets) దేశంలోని టాప్ 30లో చోటు దక్కించుకున్నాయి. అద్భుతమైన రవాణా సౌకర్యం, పార్కింగ్ సౌకర్యాలు, స్టోర్ విజిబిలిటీ మరియు వినియోగదారుల ఖర్చు సామర్థ్యం కలిగినవిగా అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తున్నాయి.
ముఖ్యంగా బెంగళూరులోని ఎంజీ రోడ్ తర్వాత సోమాజిగూడ అత్యధిక పనితీరు కనబరిచిన హై స్ట్రీట్‌లలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
నైట్ ఫ్రాంక్ యొక్క ఇండియా రియల్ ఎస్టేట్ విజన్ 2047 (Vision 2047) నివేదిక ప్రకారం, అమీర్‌పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మరియు గచ్చిబౌలితో సహా అనేక ఇతర హై స్ట్రీట్‌లు కూడా ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నాయి. ఇక్కడి వాణిజ్య సముదాయాలలో దుస్తులు, ఆహారం ప్రధాన వ్యాపారంగా సాగుతుంది.
వాణిజ్య సముదాయాలు (మాల్స్) బహుముఖ కుటుంబ వినోదం, షాపింగ్ గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందాయి, ఒకే ఎయిర్ కండిషన్డ్ పైకప్పు కింద విభిన్న రిటైల్ షాపులు నెలకొల్పారు. ఇది ప్రజలకు ఒకే ప్లేస్ లో అన్ని రకాల బ్రాండ్స్ షాప్స్ ను సందర్శించి షాపింగ్ చేసే అవకాశం లభిస్తుంది.
హైదరాబాద్ రిటైల్ మార్కెట్ దాదాపు రెండు మిలియన్ చదరపు అడుగుల హై స్ట్రీట్ స్థలంతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
నైట్ ఫ్రాంక్ ప్రకారం, 2022లో హైదరాబాద్‌తో సహా టాప్ ఎనిమిది నగరాల్లో 271 మాల్స్ ఉన్నాయి. ఈ నగరాల్లోని సుమారు 30 హై స్ట్రీట్‌లు 13.2 మిలియన్ చదరపు అడుగుల మొత్తం రిటైల్ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో 5.7 మిలియన్ చదరపు అడుగులు ఆధునిక రిటైల్ స్థలాన్ని కలిగి ఉన్నాయి.
ఆదాయ స్థాయిల పెరుగుదల మరియు భారతదేశంలో పెరుగుతున్న వినియోగదారుల ఖర్చు ప్రవృత్తితో, 2047 నాటికి, రిటైల్ వినియోగం మొత్తం ప్రైవేట్ వినియోగంలో 37 శాతం ఉంటుందని అంచనా. వినియోగంలో ఈ పెరుగుదల రిటైలర్ల ప్రవేశం మరియు విస్తరణను పెంచుతుందని అంచనా వేయబడింది, ఇది రిటైల్ రియల్ ఎస్టేట్ రంగంలో షాపింగ్ మాల్స్ మరియు హై స్ట్రీట్‌లకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అయిన నైట్ ఫ్రాంక్ నిర్వహించిన సర్వే ప్రకారం, బెంగళూరులోని ఎంజి రోడ్ దేశంలోని 10 హై స్ట్రీట్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది, సోమాజిగూడ రెండవ స్థానంలో మరియు లింకింగ్ రోడ్ (ముంబై) మరియు సౌత్ ఎక్స్‌టెన్షన్ (ఢిల్లీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఖాన్ మార్కెట్ (ఢిల్లీ), డిఎల్ఎఫ్ గల్లెరియా (గురుగ్రామ్) వంటి మార్కెట్లు చాలా తక్కువ స్కోరు సాధించగా, ఎంజి రోడ్ (బెంగళూరు), సోమాజిగూడ (హైదరాబాద్), లింకింగ్ రోడ్ (ముంబై), అన్నా నగర్, పార్క్ స్ట్రీట్ మరియు కామాక్ స్ట్రీట్ (కోల్‌కతా) వంటి యాక్సెస్ రోడ్ వెంబడి ఉన్న మార్కెట్లు అధిక స్కోరు సాధించాయి. నైట్ ఫ్రాంక్ సర్వే హైదరాబాద్‌ను రెండవ స్థానంలో ఉంచింది.
నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా నగరాలు వాటి హై స్ట్రీట్‌ల ద్వారా గుర్తించబడతాయి, తరచుగా నగరంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి మరియు ఈ వీధుల్లోని బ్రాండ్‌లు - ప్రపంచ వేదికపై నగరం విలువకు బేరోమీటర్."