కోట్లనర్సింహులపల్లెలో అరుదైన వరాహస్వామి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లెలో కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యులు అరుదైన వరాహస్వామి మూర్తిని గుర్తించారు.

Update: 2024-06-27 06:56 GMT

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లెలో కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యులు అరుదైన వరాహస్వామి మూర్తిని గుర్తించారు. అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొల్లూరి సాయి బీరప్పగుడివద్ద సున్నపురాతిలో చేసిన పరిశోధనలో 3అంగుళాల ఎత్తున్న చిన్న వరాహమూర్తి ఇష్టదైవశిల్పం గుర్తించారు. ఈ శిల్పం వరాహమూర్తి పాదాలకు ఎత్తుమడిమలపాదుకలు విశేషం. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి చాలా అపురూపమైనది, అరుదైనది అని వారు చెబుతున్నారు.


శిల్పాన్ని పరిశీలించిన స్థపతి, చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డిగారు 4వ శతాబ్దానికి చెందిన శిల్పమని అభిప్రాయపడ్డారు. కోట్లనర్సింహులపల్లెలో సాతవాహనకాలంనాటి కుండపెంకులు, కొత్తరాతియుగం రాతిగొడ్డలి ముక్క, మధ్యరాతియుగంనాటి రాతిపరికరాల కండశిల లభించాయి. ఈ చిన్నవరాహస్వామి అర్చామూర్తి శిల్పం తొలుత కొండమోతులో దొరికిన నరసింహస్వామి ఫలకాన్ని గుర్తు తెస్తున్నదని, నరసింహస్వామి క్షేత్రంలో ఇపుడీ వరాహమూర్తి దొరకడం చారిత్రకంగా విశేషమని కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.

Tags:    

Similar News