రేవంత్ రెడ్డికి హైకోర్టులో రిలీఫ్

సాక్ష్యాలు లేవని కోర్టు కేసు కొట్టేసింది;

Update: 2025-07-17 12:03 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయన పై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

2016లో రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యపై ఎస్సి ఎస్టీ కేసు నమోదైంది.

ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి 2020లో కోర్టునాశ్రయించారు. వాద ప్రతివాదనలు గత 20న ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదు దారుడి ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు కేసు కొట్టివేసింది.
Tags:    

Similar News