‘88కోట్ల పేజీల్లో కులగణన సర్వే డేటా’

పలు విషయాల్లో రాహుల్ గాంధీ చేసిన పోరాటాలతోనే కేంద్రం మెడలు వంచింది.;

Update: 2025-07-24 14:12 GMT

స్వతంత్ర భారతదేశంలో కులగణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణయే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేసే ఆలోచన చేయలేదని, కానీ తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి చూపామని రేవంత్ తెలిపారు. ఆనాడు చేసిన ‘భారత్ జోడో యాత్ర’ రాహుల్ గాంధీ.. కులగణన ప్రస్తావన తొలిసారి తీసుకొచ్చారని, ఆయన విజన్ మేరకు తమ ప్రభుత్వం రాష్ట్రంలో విజయవంతంగా కులగణన చేపట్టిందని రేవంత్ చెప్పారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో చేసిన కులగణన సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆయన కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.

సర్వే సమగ్రంగా జరిగింది: రేవంత్

‘‘తెలంగాణలో కులగణన సర్వేను 2024లో ప్రారంభించాం. సామాజిక, ఆర్థిక, కుల, రాజకీయ సర్వే సమగ్రంగా జరిగింది. ఈ సర్వేకు సంబంధించి డేటా మొత్తం 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తంగా ఉంది. ప్రధాని మోదీకి బీసీలంటే ప్రేమ లేదు. మోదీకనే కాదు.. అసలు బీజేపీకే బీసీలంటే పడదు. అందుకే ఇక్కడ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేశారు. ముస్లిం రిజర్వేషన్లకు ముడిపెట్టి ద్వందవైఖరి అవలంభిస్తున్నారు. అనేక విషయాన్ని మోదీ సర్కార్ దిగివచ్చేలా రాహుల్ గాంధీ పోరాటాలు చేశారు. అందుకు మూడు నల్లచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడమే పెద్ద నిదర్శనం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం ఓకే చెప్పిందంటే అందుకు రాహుల్ గాంధీ చేసిన పోరాటమే కారణం’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.

దేశానికే దిక్ష్సూచిగా తెలంగాణ సర్వే: భట్టి

‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఇప్పుడు దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. రాహుల్ గాంధీ హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి వస్తూనే కులగణన సర్వేకు శ్రీకారం చుట్టాం. చెప్పినట్లే సర్వేను సమగ్రంగా పూర్తి చేశాం. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించాం. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే దేశవ్యాప్తంగా కూడా జనగణనతో పాటు కులగణన చేయడానికి కూడా కేంద్రం అంగీకారం తెలిపింది’’ అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

Tags:    

Similar News