రేవంత్ దక్షిణాది నేత అవుతాడా?

కేంద్రం దక్షిణ భారత రాష్ట్రాల మీద చూపిస్తున్న వివక్ష మీద దక్షిణాది రాష్ట్రాల కూడగట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నం

Update: 2024-07-23 12:29 GMT

 నిధులు, ప్రాజక్టులు, ఇన్ స్టిట్యూట్ లను కేటాయించడంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు త్వరలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ సాయంకాలం హైదరాబాద్ లో కేంద్ర బడ్జెట్ స్పందిస్తూ ఆయన ఈ విధంగా చెప్పారు. కేంద్రం తెలంగాణ మీద ఎలాంటి వివక్ష చూపిస్తున్నదో  ఈ రోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సాక్ష్యం అని ఆయన్నారు.

మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరగుతు ఉందని చెబుతూ ఈ విషయంలో ఈ రాష్ట్రాలను సమీకరించాలనుకుంటున్నానని, దీనిమీద కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశానని, వారు సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో కలిసిరావాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. త్వరంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్ఛేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తున్నట్లు ఆయన చెప్పారు.

 కేంద్రం ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాస్తూ ఉందని, దీనిని వ్యతిరేకించాలని ఆయన అన్నారు. 

Tags:    

Similar News