ఇక రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం, జీఓ జారీ
హైదరాబాద్ నగరంలో ప్రతీ ఏటా వైభవంగా జరిపే సదర్ సమ్మేళనాన్ని ఇక నుంచి రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
By : The Federal
Update: 2024-11-02 09:52 GMT
హైదరాబాద్ నగరంలో ప్రతీ ఏటా వైభవంగా జరిపే సదర్ సమ్మేళనాన్ని ఇక నుంచి రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ సాధారణ పరిపాలనా శాఖ జీఓఆర్టీ నంబరు 1459 తో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
- హైదరాబాద్ నగరానికి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన వినతిపై ప్రభుత్వ యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చర్ 317 నంబరు జీఓను జారీ చేసింది.
- ప్రతీ సంవత్సరం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా జరిపేందుకు వీలుగా రాష్ట్ర పండుగగా హోదా కల్పించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు సదర్ సమ్మేళనంపై ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పండుగగా సదర్ ను యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం కల్చర్ శాఖ నిర్వహించనుంది. సదర్ సమ్మేళనం కోసం బడ్జెట్ నుంచి నిధులు కూడా కేటాయించనున్నారు.
దున్నరాజుల విన్యాసాలు
దున్నపోతులను అందంగా అలంకరించి వాటి సదర్ ఉత్సవాల్లో విన్యాసాలు చేయిస్తారు. ఎర్ర రంగు రుమాలు ధరించి యాదవ సోదరులు దున్నరాజులతో చేయిస్తున్న విన్యాసాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద జరిగిన ఉత్సవాల్లో ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. దీపావళి తర్వాత జరిగే సదర్ ఉత్సవాలు ఇక నుంచి మరింత వైభవంగా జరుపుకోనున్నారు. హైదరాబాద్ నగరంలో మాదన్నపేట,నారాయణగూడలోని వైఎంసిఎ లో సదర్ ఉత్సవ్ మేళా నిర్వహించారు.ఈ సదర్ ఉత్సవాల్లో హర్యానాకు చెందిన దున్న రాజులు సందడి చేశాయి.హర్యానా నుంచి ప్రత్యేకంగా వచ్చిన 2 టన్నుల బరువు, 7 అడుగుల పొడవు ఉన్న ముర్రా జాతి దున్నపోతు సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సదర్ సంబురం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి.ప్రసిద్ధికెక్కిన పండుగల్లో బోనాల పండుగ, బతుకమ్మ పండుగలు, సదర్ ఉత్సవం ప్రధానమైనవి. మూగ జీవులకు తాము ఇచ్చే ప్రాధాన్యతను తెలిపేందుకు సదర్ ఉత్సవాలను యాదవ సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు.దీపావళి సందర్భంగా వచ్చే సదర్ సంబురాలు ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వ్యవసాయ అనుబంధ రంగాల వెల్లువను చాటే ఉత్సవం సదర్. పాడి పరిశ్రమల అభివృద్ధిలో దున్నపోతుల పోషణ కీలకమైనది.
సదర్ ఉత్సవాలను గ్రామాలకు తీసుకెళ్లాలి : సీఎం
సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా జరిపే సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.‘‘హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిది. నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణం.హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారు. ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారు.ఇప్పుడు మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడండి. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచింది. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దాం’’ అని రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా జరిపే సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
— Telangana CMO (@TelanganaCMO) October 27, 2024
🔹హైదరాబాద్ నగర… pic.twitter.com/RFT2CggEKz