మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందన ఏమిటంటే...
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలపై సినీనటి సమంత స్పందించారు. తన విడాకుల విషయం వ్యక్తిగతమని ఊహాగానాలు చేయవద్దని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అభ్యర్థించారు.
By : The Federal
Update: 2024-10-02 15:44 GMT
సినీ నటీనటులు నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్ కారణమని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటి సమంత ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. ‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని సమత పేర్కొన్నారు. స్త్రీగా ఉండటానికి,బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి...చాలా ధైర్యం, బలం కావాలి అని ఆమె పేర్కొన్నారు.
వ్యక్తిగత విషయాల పట్ల బాధ్యతగా మాట్లాడండి
‘‘కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను- దయచేసి చిన్నచూపు చూడకండి.ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.’’అని సమంత కోరారు.
పరస్పర అంగీకారంతోనే విడాకులు
‘‘నా విడాకులు పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా జరిగాయి, దీనిలో ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు.దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరు? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను,అలానే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సమంత తన ఇన్ స్టా వేదికగా పేర్కొన్నారు.
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత #SamanthaRuthPrabhu #Samantha
— Sarita Avula (@SaritaAvula) October 2, 2024
నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.
స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.... చాలా ధైర్యం, బలం కావాలి.
కొండా సురేఖ గారూ, ఈ… pic.twitter.com/sSZNugAzfD