ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సెటైర్లు
ఇదేందయ్య.. ఇది.. ఇది నేనేడా చూడలా.. ఎన్నికలంటే వైల్డ్ ఫైర్ అనుకుంటే.. ఢిల్లీ ఎన్నికలను ఫ్లవర్ చేసేస్తున్నారే.;
ఇదేందయ్య.. ఇది.. ఇది నేనేడా చూడలా.. ఎన్నికలంటే వైల్డ్ ఫైర్ అనుకుంటే.. ఢిల్లీ ఎన్నికలను ఫ్లవర్ చేసేస్తున్నారే. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంటే గోళ్లతో పాటు వేళ్లు కూడా కొరికేసుకునేటంత ఉత్కంఠ ఉంటుందని అనుకుంటే.. ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. వీటి అప్‌డేట్స్ కోసం సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం.. అందులో పెద్ద వార్ నడుస్తోంది. ఇది పార్టీల మధ్య కాదండోయ్.. నెటిజన్స్ మధ్య. ఢిల్లీ ఫలితాలపై జోకులు పేల్చడమే ఈ పోస్ట్‌ల యుద్ధంలో అందరి ప్రధమ కర్తవ్యంలా కనిపిస్తోంది. కొందరు బీజేపీ గెలుపుని గ్లోరిఫై చేస్తుంటే మిగిలిన వారు మాత్రం ఆప్ ఓటమిని, కాంగ్రెస్ అత్యంత ఘోర పరాజయాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ ఫలితాలపై మీమ్‌లు, చిన్నచిన్న సెటైరికల్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో పార్టీల నాయకులు చేసిన కామెంట్స్ పెడుతూ.. పంచులు పేలుస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. రాహుల్ గాంధీ సెంచరీకి దగ్గర ఉన్నారన్న ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న సెంచరీ.. ఏ పోరాటాల్లోనో కాదు.. ఓటములు సాధించడంలో. రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 90 ఓటముల మైలురాయిని అందుకుందట. ఇంకా పదే రాహుల్ జీ.. త్వరగా కానిచ్చేయండంటూ నెటిజన్లు ఎటకారమాడుతున్నారు.
Delhi elections summary 😁#DelhiElectionResults pic.twitter.com/clb7Vwk6Ys
— SwatKat💃 (@swatic12) February 8, 2025
Haha it's a win for BJP pic.twitter.com/uOy7evrrFW
— Squint Neon (@TheSquind) February 8, 2025
😂😂😂😂 pic.twitter.com/CXgPB3mUVR
— BALA (@erbmjha) February 8, 2025