సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీకి బంగారు బోనం రేపే..

బ్రిటీషుకాలం నుంచి పూజలందుకుంటున్న అమ్మవారు;

Update: 2025-07-09 06:29 GMT

ఆషాడ మాసంలో హైద్రాబాద్ లో బోనాలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీకి బంగారు బోనం సమర్పించనున్నారు. ఇప్పటికే చారిత్రాత్మక గోల్కొండ ప్రాంగణంలోని జగదాంబ దేవాలయంలో సప్త మాతృకల బోనం సమర్పించిన సంగతి తెలిసిందే గోల్కొండ జగదాంబ దేవాలయం తర్వత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలు వేడుకలు జరగడం సాంప్రదాయంగా వస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాలు వేడుకలకు రావల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ నెల 29న అమ్మవారికి ఎదుర్కోలు ఉంటుంది. జులై 13, 14 తేదీల్లో బోనాలు, రంగం కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా బోనాలు వేడుకలను నిర్వహిస్తున్నారు.

కలరా వ్యాధిని సమూలంగా ప్రారదోలింది

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి నిర్వహించే బోనాలును లష్కర్ బోనాలు అంటారు. సికింద్రాబాద్ అమ్మవారిని అని పిలుస్తారు. మహంకాళీ బ్రిటీషు ఆర్మీలో పని చేసే ఉద్యోగి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నిర్మాణానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ గ్రామానికి చెందిన సురటి అప్పయ్య అమ్మవారికి భక్తుడు. 1813లో అతనికి మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీకి ట్రాన్స్ ఫర్ అయ్యింది. ఆ సమయంలో సికింద్రాబాద్ లో కలరా వ్యాప్తి చెంది వేలాది మంది చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సురటి అప్పన్న ఉజ్జయిని అమ్మవారిని మొక్కుకున్నాడు. తర్వాత కలరా వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తన మొక్కు ఫలించిన కారణంగా సూరటి అప్పన్న స్వంత డబ్బులతో ఆలయాన్ని నిర్మించాడు. తన మొక్కు తీర్చడానికి సూరటి అప్పన్న వద్దద డబ్బులేదు. అతను ఆర్మీ ఉద్యోగి కావడం వల్ల ఆలయం నిర్మించే తాహతు లేకుండా పోయింది. ఆలయం నిర్మించడానికి సూరటి అప్పన్న పెద్దల నుంచి తనకు వచ్చిన భూములను అమ్ముకున్నాడు

సూరటి అప్పన్న తన మిలటరీ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. మహంకాళీ మహత్యాన్ని స్నేహితులకు వివరించాడు. పాత బోయిగూడకు సమీపంలో ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. తాను ఉజ్జయినీ నుంచి తిరిగి వచ్చిన కారణంగా ఉజ్జయినీ అని నామకరణం చేశాడు. అప్పటి నుంచి ప్రతీరోజు అమ్మవారికి పూజలు చేస్తే ఆషాడమాసంలో బోనాలు సమర్పించారు.

Tags:    

Similar News