మందుబాబులకు షాక్

బోనాలు నేపథ్యంలో రెండ్రోజులు వైన్ షాపులు బంద్;

Update: 2025-07-10 14:51 GMT

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్ బోనాలు నేపథ్యంలో రెండ్రోజులు వైన్ షాపులను బంద్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారి చేశారు. ఈ నెల 13 వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 15 వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయి. హైద్రాబాద్ పరిధిలోని సెంట్రల్, వెస్ట్ , ఈస్ట్ పరిధిలో అన్ని వైన్ షాపులను మూసివేస్తారు.

బోనాలు పండగ అంటే తాగి తినే పండుగ కావడంతో మందుబాబులు రెచ్చిపోతుంటారు. మందు బాబులను కట్టడి చేయడంలో భాగంగా వైన్ షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వైన్ షాపులు మూసివేయడంతో  బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేచే అవకాశం ఉంది. బ్లాక్ మార్కెట్ చేసేవారిని ఎక్సైజ్ అధికారులు కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

Tags:    

Similar News