ఫోన్ ట్యాపింగ్ కేస్.. శ్రవణ్‌కు మళ్ళీ నోటీసులు
2023 లో జరిగిన ఎన్నికల సమయంలో శ్రావణ్ రావు వాడిన ఫోన్లపై సిట్ ఫోకస్ పెట్టింది. ఆ సమయంలో ఆయన ఎవరెవరితో మాట్లాడారు అన్న అంశాలపై దృష్టి పెట్టింది.;
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఒకసారి విచారించిన ఓ తెలుగు మీడియా ఔట్లెట్ ఎండీ శ్రవణ్ రావుకు పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. అతని దగ్గర ఉన్న సెల్‌ఫోన్లను సబ్మిట్చేయాలని సిట్ తన నోటీసుల్లో పేర్కొంది. అదే విధంగా ఏప్రిల్ 2న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2023 లో జరిగిన ఎన్నికల సమయంలో శ్రావణ్ రావు వాడిన ఫోన్లపై సిట్ ఫోకస్ పెట్టింది. ఆ సమయంలో ఆయన ఎవరెవరితో మాట్లాడారు అన్న అంశాలను నిర్ధారించుకోవడం కోసం ఫోన్లను హ్యండోవర్ చేయాలని కోరింది.
రెండు రోజుల క్రితం సిట్ ఎదుట హాజరయిన శ్రవణ్ రావు.. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదని సమాచారం. దాదాపు ఆరు గంటల పాటు కొనసాగిన విచారణలో ఏకాడికి ప్రశ్నలు దాటవేయడానికి శ్రవణ్ రావు ప్రయత్నించారని, కానీ ఎన్నికల సమయంలో తాను సర్వేలు చేసి అధికార పార్టీకి ఇచ్చానని చెప్పినట్లు తెలుస్తోంది. సర్వేలు ఎవరెవరికి ఇచ్చారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదాయన. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సహాయం , టచ్ లో ఉన్న వాళ్ళ పై శ్రవణ్ రావు నిఘా పెట్టినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
శ్రవణ్ రావు ఇల్లు కార్యాలయంలో ఏర్పాటు అయిన మినీ కంట్రోల్ రూమ్‌పై కూడా పోలీసుల ఆరా తీస్తున్నారు. మినీ కంట్రోల్ రూమ్ పరికరాలను ఎవరు అందజేశారు అనేదానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. Sib ప్రణీత్ రావు కంట్రోల్లో ఉండాల్సిన పరికరాలన్నీ శ్రవణ రావు ఇంట్లో ప్రత్యక్షం అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు శ్రవణ్ రావు ఇంట్లోకి ఎలా చేరాయనే దానిపై విచారణ జరుపుతున్నారు. కాగా తనకు శ్రవణ్ రావుకు ఎటువంటి సంబంధాలు లేవని శ్రవణ్ రావు చెప్పారు.