హైదరాబాదులో కల్తీకల్లు కలకలం
వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్ధితి విషమించినట్లు సమాచారం;
By : The Federal
Update: 2025-07-08 16:50 GMT
హైదరాబాద్ లో కల్తీకల్లు కలకలం రేపుతోంది. నగరంలోని కూకట్ పల్లి, హైదర్ నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి కొందరు కల్లు తాగారు. కల్లుతాగిన కొద్దిసేపటికే 13 మందికి వాంతులు మొదలయ్యాయి. కొద్దిసేపటికే వీళ్ళపరిస్ధితి ఆందోళనకరంగా మారటంతో అందరినీ దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్ధితి విషమించినట్లు సమాచారం. కల్తీకల్లు ఘటనపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.