ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఇలాంటి కేసుల విషయంలో న్యాయవాదులు వ్యవహరించే తీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.;
పార్టీ ఫిరాయింపు నేతలపై సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్లపై విచారణ నేడు ముగిసింది. మూడు వర్గాల వాదనలు విన్న ధర్మాసం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విచారణలో పిటిషనర్ల తరపున ఆర్యామ సుందరం, అసెంబ్లీ కార్యదర్శ తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసినట్లు న్యాయస్థానం చెప్పింది. గురువారం జరిగిన విచారణలో భాగంగా స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి కోర్టు తీర్పులు లేవని మనుసింఘ్వీ.. న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
దీంతో ‘మీ దృష్టిలో రీజనబుల్ టౌమ్ అంటే ఏంటి? అది ఎంత?’’ అని జస్టిస్ గవాయ్.. ప్రశ్నించారు. ఇలాంటి కేసుల విషయంలో న్యాయవాదులు వ్యవహరించే తీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, అత్యున్నత న్యాయస్థానికి వచ్చిన తరవాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
వాదనల్లో భాగంగా తన వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవా ఆర్యామ సుందరం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ‘‘రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు. స్పీకర్ తరుపున కూడా చెప్తున్నా’’ అని అన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో అంటే కోర్టు నుంచి రక్షణ ఉంటుందని రేవంత్ ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ‘‘సీఎం కనీస స్వీయనియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలానే మాట్లాడారు. ఆ తర్వాత కూడా తన తీరు మార్చుకోకుంటే ఎలా?’’ అని ప్రశ్నించారు సుందరం.
సుందరం వ్యాఖ్యలను మనుసింఘ్వీ అడ్డు చెప్పి.. ప్రతిపక్షం వ్యాఖ్యలను ప్రస్తావించడంతో ధర్మాసనం వారిని వారించింది. ఇవన్నీ ఇప్పుడు అప్రమస్తుతమని పేర్కొంది. సీఎం మాటలను కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నారు. మేం సమయమనం పాటిస్తున్నాం.. అదే విధంగా మిగిలిన రెండు వ్యవస్థలు కూడా గౌరవంతో ఉండాలని సూచించారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం తీర్పు ఏమని ఇస్తుందా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో ఎప్పటిలానే స్పీకర్‌దే తుది నిర్ణయం అన్న విధంగా తీర్పు ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.