ఐదో పెళ్ళికి రెడీ అయిన కానిస్టేబుల్.. పోక్సో కేసు నమోదు
నిత్యపెళ్ళికొడుకుగా చలామణి అవుతున్న నిందితుడిపై యాక్షన్‌ను రెడీ అయిన పోలీసులు.;
సూర్యపేటలో ఓ కానిస్టేబుల్ చేసిన పని ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. అతడిపై సూర్యపేట గ్రామీణ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిత్య పెళ్లికొడుకుగా చలామణి అవుతూ.. అమ్మాయిలను మోసం చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నాలుగు పెళ్ళిళ్లు చేసుకున్న కానిస్టేబుల్ కృష్ణంరాజు.. తాజాగా ఐదో పెళ్లికి కూడా రెడీ అయ్యాడు. అయితే ఏడాది క్రితం కృష్ణంరాజు.. సూర్యాపేట మండలానికి చెందిన పదోతరగతి బాలికను వివాహమాడాడు.
ఈ విషయంపైనే సదరు కానిస్టేబుల్‌ను ఎస్పీ నరసింహ వారం రోజుల క్రితం సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ వివాహం చేసుకున్న బాలిక వయసు 13ఏళ్లు కావడంతో ఆమె తల్లి నుంచి ఫిర్యాదు తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్సై బాలునాయక్ తెలిపారు. చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజు గతంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన సమయంలో ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యారు.