గవర్నర్ తమిళిసై రాజీనామా.. ఎన్నికల్లో పోటీకి సిద్ధం!!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోమవారం క్లారిటీ వచ్చేసింది.

Update: 2024-03-18 06:29 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోమవారం క్లారిటీ వచ్చేసింది. ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపించారు. ఆమె రాజీనామాని రాజ్ భవన్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు స్పష్టం అవుతోంది. తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై సెంట్రల్‌ స్థానాల్లో ఒక స్థానం నుంచి తమిళిసై పోటీచేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రగతి భవన్ vs రాజ్ భవన్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రగతి భవన్ కి రాజ్ భవన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రాజ్ భవన్ ఆహ్వానిస్తుంటే ప్రోటోకాల్ పాటించకుండా కేసీఆర్ తనని అవమానిస్తున్నారని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేసేవారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అనుమానంగా ఉందంటూ కేసీఆర్ సర్కార్ పై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.

బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించేవారు. ఎమ్మెల్సీల నియామకం విషయంలోనూ ఆమె చర్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

Tags:    

Similar News