తెలంగాణ స్కూల్స్ హాలిడేస్, ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసిందోచ్

తెలంగాణ విద్యా శాఖ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్‌ ను విడుదల చేసింది. పాఠశాలల టైమింగ్స్, ఎగ్జామ్స్ షెడ్యూల్, హాలిడేస్ లిస్ట్ ప్రకటించింది.

Update: 2024-05-25 14:41 GMT

తెలంగాణ విద్యా శాఖ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్‌ ను విడుదల చేసింది. 2024-25 అకడమిక్ ఇయర్ జూన్ 12న మొదలై ఏప్రిల్ 23, 2025 వరకు కొనసాగనుంది. 'బడి బాట' పేరిట జూన్ 1 నుండి 11 వరకు ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.

అకడమిక్ క్యాలెండర్ 2024-2025:

ఎగ్జామ్స్ షెడ్యూల్:

ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 1 : జూలై 31 వ తేదీకి

ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 2 : సెప్టెంబర్ 30 వ తేదీకి

సమ్మేటివ్ అసెస్‌మెంట్ 1 : అక్టోబర్ 21 నుండి 28 వరకు

ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 3: డిసెంబర్ 17 వ తేదీకి

ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 4: జనవరి 29, 2025 వ తేదీకి పదవ తరగతికి, ఫిబ్రవరి 28, 2025 న 1 నుండి 9 వ తరగతులకు

సమ్మేటివ్ అసెస్‌మెంట్ 2 (1 నుండి 9 తరగతులు) : ఏప్రిల్ 9 నుండి 19, 2025

10 వ తరగతికి ప్రీ-ఫైనల్: ఫిబ్రవరి 28, 2025కి ముందు

SSC బోర్డ్ పరీక్షలు: మార్చి 2025

జనవరి 10, 2025 నాటికి 10 వ తరగతికి సంబంధించిన సిలబస్ పూర్తి

ఫిబ్రవరి 28, 2025 నాటికి 1 నుండి 9 తరగతులకు సిలబస్ పూర్తి

రోజువారీ పాఠశాల అసెంబ్లీలో యోగా, ధ్యానం చేర్చబడ్డాయి.

సెలవులు:

దసరా సెలవులు: అక్టోబర్ 2 నుండి 14 వరకు (13 రోజులు)

మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 23 నుండి 27 వరకు

మిషనరీ పాఠశాలలు కాకుండా సంక్రాంతి సెలవులు: జనవరి 13 నుండి 17 వరకు

వేసవి సెలవులు: ఏప్రిల్ 24, 2025 నుండి జూన్ 11, 2025 వరకు

స్కూల్ టైమింగ్స్ :

హై స్కూల్స్ : ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ విషయానికి వస్తే, సమయం ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 వరకు

అప్పర్ ప్రైమరీ స్కూల్స్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4.15 వరకు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు

ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూళ్ల ప్రైమరీ సెక్షన్స్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో రాత్రి 8.45 నుంచి 3.45 గంటల వరకు సమయం ఉంటుంది.

హై స్కూల్స్ లో పనిచేస్తున్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ : ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.15 వరకు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు

Tags:    

Similar News