ధర్మనిధి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం..

సెప్టెంబర్ 18న పురస్కారాలను ప్రదానం చేయనున్న తెలంగాణ సారస్వత పరిషత్తు.;

Update: 2025-09-11 11:53 GMT

2025 సంవత్సరానికి గానూ ధర్మనిధి సాహితీ పురస్కారాలను తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రకటించింది. ఈ పురస్కారాలను సెప్టెంబర్ 18న అబిడ్స్ తిలక్ ‌రోడ్‌లోని దేవులపల్లి రామానుజరావు కళామందిరం వేదికగా అందించనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించనున్నారు.

పురస్కారాలు అందుకునేది వీరే..

మతి ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ సాహితీ పురస్కారం : డా. రాయారావు సూర్యప్రకాశరావు

ఆలూరి బైరాగి సాహితీ పురస్కారం : వేముగంటి మురళీకృష్ణ

ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం : డా. సంధ్యా విప్లవ్

డా. వానమామలై వరదాచార్య సాహితీ పురస్కారం : పింగిలి సుదర్శన్రెడ్డి

డా. చింతపల్లి వసుంధరారెడ్డి జానపద విజ్ఞాన పురస్కారం : డా. సగిలి సుధారాణి

డా. బెజవాడ గోపాలరెడ్డి సాహితీ పురస్కారం : డా. తూర్పు మల్లారెడ్డి

డా. దివాకర్ల వేంకటావధాని సాహితీ పురస్కారం : డా. సాగి కమలాకర శర్మ

డా. రావికంటి వసునందన్ సాహితీ పురస్కారం : కందుకూరి అంజయ్య

విశాల సాహితి బి.ఎస్. రాములు యువసాహిత్య పురస్కారం : మ్యాకం రవికుమార్

Tags:    

Similar News