మొబైల్ రికవరీలో టాప్ లో నిలిచిన తెలంగాణ

పెరుగుతున్న మొబైల్ దొంగతనాలు ఓవైపు, నకిలీ మొబైల్ ఫోన్ల విక్రయాలు మరోవైపు... నష్టపోతున్నది మాత్రం మొబైల్ వినియోగదారుడే. వీటన్నిటి మధ్య తెలంగాణ పోలీసులు ఓ రికార్డ్ సృష్టించారు.

Update: 2024-05-21 15:41 GMT

పెరుగుతున్న మొబైల్ దొంగతనాలు ఓవైపు, నకిలీ మొబైల్ ఫోన్ల విక్రయాలు మరోవైపు... నష్టపోతున్నది మాత్రం మొబైల్ వినియోగదారుడే. వీటన్నిటి మధ్య తెలంగాణ పోలీసులు ఓ రికార్డ్ సృష్టించారు. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ ర్యాంక్ సాధించారు. రాష్ట్ర పోలీసులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి 30,049 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు నివేదించారు.

దీంతో 35,945 మొబైల్స్‌ను రికవరీ చేసిన కర్ణాటక తర్వాత దేశంలో రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర -15,426, ఆంధ్రప్రదేశ్ -7,387 మొబైల్స్ రికవరీ చేసి వరుసలో నిలిచాయి.

రాష్ట్రంలో ఏప్రిల్ 19, 2023న పైలట్ ప్రాతిపదికన ప్రారంభించిన CEIR పోర్టల్ రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తోంది. జంట నగరాల్లోని మూడు కమిషనరేట్‌ లలో రోజుకు సగటున 76 మొబైల్‌ లను పోలీస్ డిపార్ట్మెంట్ రికవరీ చేస్తోంది.

తెలంగాణలో హైదరాబాద్ కమిషనరేట్ అత్యధికంగా 4,869 మొబైల్ పరికరాలను రికవరీ చేసి ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉంది. సైబరాబాద్ -3,078, రాచకొండ -3,042 మొబైల్ పరికరాల రికవరీలో ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. వరంగల్ -1,919, నిజామాబాద్ -1,556 మొబైల్ పరికరాల హైయెస్ట్ రికవరీ స్థానాల జాబితాలో ఉన్నాయి. 


Tags:    

Similar News