సినిమాలు పైరసీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఏడాదిన్నరగా ఇదే వ్యాపారం;

Update: 2025-07-03 11:07 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పైరసీలకు పాల్పడుతున్న వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు అరస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ గత కొన్ని సంవత్సరాలుగా పైరసీలకు పాల్పడుతున్నాడు. ఇతను పైరసీ చేయడానికి నగరంలో ఓ థియేటర్ ఎంచుకున్నాడు.ఇప్పటి వరకు 65 సినిమాల వరకు పైరసీలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు.

హెచ్ డి ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్మేవాడు. నిందితుడు టెలిగ్రామ్ లో పైరసీ వీడియోలు అప్ లోడ్ చేసేవాడు. ఏడాదిన్నరగా 40 సినిమాలు పైరసీ చేసాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ చేంజర్ సినిమాలను జనకిరణ్ పైరసీ చేసాడు. అతని వద్ద నుంచి సినిమా ఫైల్స్, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక సినిమా థియేటర్లో పైరసీ చేసేవాడు . తర్వాత పైరసీ ముఠాకు అమ్మేవాడు. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ స్వీకరించేవాడు. క్రిప్టో తో బాటు బిట్ కాయిన్స్ స్వేకరించే వాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2024లో సినీ ఇండస్ట్రీలో పైరసీ జరిగి కోట్లాది రూపాయల నష్టం చవి చూస్తుంది. నిందితుడిపై సినిమాటోగ్రఫి యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి కటకటాలకు పంపారు.

Tags:    

Similar News