గద్దర్ అవార్డులు ఇచ్చేది అప్పుడే..
14 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కళాకారులను ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న తొలి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఇదేనని భట్టి విక్రమార్క చెప్పారు.;
చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కళాకారులకు గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి తెలంగాణలో కళాకారులకు ఎటువంటి అవార్డులు ఇవ్వలేదు. కాగా.. వారిని ప్రోత్సహించడం కోసం వారికి అవార్డులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని గ్రహించిన ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిశ్చయించింది. తాజాగా తెలంగాణలో ఈ అవార్డులు ఎప్పటి నుంచి ప్రదానం చేయనుందని ప్రకటించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్ తెలిపారు. తమ ప్రభుత్వం తెలుగు సినిమాలతో పాటు ఉర్దూ సినిమాలను కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు.
‘‘తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ గద్దర్ బాణి, పాటలను అనుకరిస్తారు. ఆదరిస్తారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా హర్షించదగిన అంశం కూడా. హైదరాబాద్‌లోనే జరిగే చలనచిత్ర నిర్వహిస్తున్నఅవార్డుల ప్రదాన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. అందుకు మా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నాం’’ అని భట్టి చెప్పారు. 14 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కళాకారులను ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న తొలి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఇదేనని చెప్పారాయన.