జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముహూర్తం ఖారారు..

నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Update: 2025-10-06 11:21 GMT

తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు షెడ్యూల్ ఖారు అయింది. దీనిని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 21.. నామినేషన్లకు ఆఖరు తేదీ. మరుసటి రోజు అంటే అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అక్టోబర్ 24 ఆఖరు రోజు అని ఎన్నికల షెడ్యూల్‌లో ప్రకటించారు.

వేగం పెంచిన పార్టీలు..

అయితే ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వ్యూహాలను రచించుకున్న పార్టీలు.. వాటిని అమలు చేయడంలో వేగం పెంచడానికి రెడీ అవుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థి ఖరారు అవుతూనే తమ వ్యూహాలను అమలులో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థి మాగంటి సునీత అని ప్రకటించేసింది. ప్రచారం కూడా ఒకమోస్తరుగా స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో ప్రచారంలో వేగం పెంచడానికి బీఆర్ఎస్ కసరత్తులు స్టార్ట్ చేస్తోంది. ఉపఎన్నిక ప్రచారం కోసం మూడు పార్టీల నుంచి కూడా బడా నేతలు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News