నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు
By : The Federal
Update: 2025-10-06 09:00 GMT
హైదరాబాద్ లో నకిలీ డాక్టరేట్లను ప్రధానం చేస్తున్న పెద్దేటి యోహను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో యోహ అనే వ్యక్తి నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారు. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో యోహ డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు చెప్పారు. పలువురికి డబ్బులు తీసుకుని డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రవీంద్రభారతికి చేరుకుని యోహను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి నకిలీ డాక్టరేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోగస్ డాక్టరేట్ సర్టిఫికేట్లు ప్రదానం చేస్తున్న రాకెట్ లో ఎవరి ప్రమేయం ఉందో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.