ఎత్తు తక్కువగా ఉన్న వ్యక్తికి లిప్ట్ ఇచ్చిన ‘నిమ్స్’

భార్యతో నిమ్స్ డైరెక్టర్ బీరప్పను కల్సిన మల్లేష్

Update: 2025-10-06 11:13 GMT

ఎత్తు తక్కువగా ఉన్న మల్లేష్ కు నిమ్స్ డైరెక్టర్ ఆపన్నహస్తం అందించారు. ఎత్తు తక్కువ ఉన్నావు ఉద్యోగానికి పనికి రావు అని అనేక చీత్కారాలు ఎదుర్కొన్నారు. ఉద్యోగాన్వేషణలో భాగంగా మల్లేష్ తన భార్యను తీసుకుని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్పకార్యాలయానికి చేరుకున్నారు. తన దైన్య స్థితిని డైరెక్టర్ కు వివరించారు. కరిగిపోయిన బీరప్ప మల్లేష్ కు ఉద్యోగం ఇస్తానని హామి ఇచ్చారు. గుత్తే దార్ సీతారామయ్యతో కల్సి లిప్ట్ ఆపరేటర్ గా నియామక పత్రాన్ని అందజేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ఉద్యోగాన్వేషణ చేస్తున్న మల్లేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్న చిన్నపనులు చేసుకునే మల్లేష్ కు నిమ్స్ లో లిప్ట్ ఆపరేటర్ ఉద్యోగం రావడం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు. శంషాబాద్ కు చెందిన మరుగుజ్జుకు పెద్ద మనసు చేసుకుని ఆదుకున్న నిమ్స్ డైరెక్టర్ ను ప్రశంసించారు.

Tags:    

Similar News