వనపర్తి జిల్లాలో అత్తను చంపిన కోడలు

సతాయిస్తుందని ఇనుపరాడ్డుతో కొట్టి..

Update: 2025-10-06 10:10 GMT

తెలంగాణ వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేవల్లి మండలం నాగ్ పూర్ గ్రామంలో ఓ కోడలు అత్తను (భర్త తల్లిని)చంపేసింది. ప్రతీ రోజు తనను సతాయిస్తుందన్న కారణం చూపి కడతేర్చింది. నాగ్ పూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ(72), దసరయ్య దంపతులకు నలుగురు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు.

ఎల్లమ్మ భర్త దసరయ్య ఇటీవల చనిపోవడంతో కొన్ని రోజుల నుంచి కొడుకు దగ్గరికి వచ్చేసింది. అయితే బొగురమ్మ తన అత్తతో తరచూ గొడవపడేది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బొగురమ్మ అత్త తలపై ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి కోడలిని అరెస్ట్ చేశారు. తనను వేధించడంతో చంపేసినట్టు బొగురమ్మ పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈ ఘటనపై ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News