సినినటిపై దాడి చేసిన యువకుడిపై కేసు
బహిరంగ మూత్రవిసర్జన చేయడాన్ని నటి ప్రశ్నించినందుకు....
By : The Federal
Update: 2025-10-06 12:22 GMT
సినీ నటిపై ఓ యువకుడు దాడి చేసిన ఆరోపణల నేపథ్యంలో దేవేందర్ అనే యువకుడిపై కేసు నమోదైంది. ఈ నెల 1వ తేదీన ఎల్లారెడ్డిపేటలో నటి నివాసమున్న అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలంలో ఓ యువకుడు బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. దీన్ని చూసిన నటి యువకుడిపై విరుచుకుపడింది. దీంతో యువకుడు మరో ఇద్దరు మహిళలను తీసుకొచ్చి అపార్ట్ మెంట్ ఎదుట గలాటా సృష్టించాడు. ఓ దశలోయువకుడు సినీ నటిపై దాడి చేశాడు. దీంతో నటి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడికి పాల్పడ్డ నిందితుడు దేవేందర్ పై బిఎన్ఎస్ సెక్షన్లు 74, 115(2), 79, 292 క్రింద కేసులు నమోదయ్యాయి. నటి పిఎ ప్రశ్నించినందుకు నిందితుడు అతడిపై కూడా దాడి చేసినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్టపోలీసులు తెలిపారు.