ఇన్సురెన్స్ డబ్బుల కోసం అత్తను చంపిన అల్లుడు

సుపారీ ఇచ్చి కారుప్రమాదంగా చిత్రీకరణ;

Update: 2025-07-12 12:18 GMT

ఎన్నిచట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. నేరాలు చేయడానికి నేరస్థులు రకరాల మార్గాలు వెతుక్కుంటున్నారు. పిల్లనిచ్చిన అత్తకు రకరకాల ఇన్సురెన్స్ చేయించాడో అల్లుడు. కొడుకుకంటే ఎక్కువ చూసుకుంటున్నాడనుకుంది ఆ అత్త. సిద్దిపేట్ జిల్లా తొగుట మండలం పెద మసాన్ పల్లి శివారులో జరిగిన కారు ప్రమాదంలో అత్త చనిపోయింది.కట్ చేస్తే సుపారీ హత్య అని వెల్లడైంది. అత్త ఇన్సురెన్స్ డబ్బులకు కక్కుర్తి పడ్డ అల్లుడే ఈ హత్య చేయించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద మసాన్ శివారులో ఈ నెల 7 న రోడ్డు ప్రమాదం జరిగింది. 60 ఏళ్ల రామవ్వ చనిపోయింది. రోడ్డు ప్రమాదంలో తన అత్త చనిపోయిందని పోలీసులకు వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. వెంకటేశ్ కంప్లైంట్ ఇచ్చే తీరులో పోలీసులకు డౌటొచ్చింది. కూపీ లాగితే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. అత్త పేరిట చేసే ఇన్సురెన్స్ పైసలకు కక్కుర్తి పడి హత్య చేసినట్ట కన్ఫర్మ్ అయ్యింది. రామవ్వ పేరిట ఉన్న ఇన్సురెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకుంటే రూ 60 లక్షలు పొందే వీలుంది.ఎలాగైనా ఇన్సు రెన్స్ డబ్బులు పొందాలని స్కెచ్ వేశాడు వెంకటేశ్ . ఇందుకోసం కరుణాకర్ తో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డీల్ ఏమిటంటే సగం ఇన్సురెన్స్ డబ్బులు కరుణాకర్ కు ఇవ్వాలి. అంటే రూ 30 లక్షలు ఇవ్వాలి. ఈ 30 లక్షల కోసమే కరుణాకర్ రామవ్వను తన కారుతో గుద్దేసాడు. స్పాట్ లో నే రామవ్వ చనిపోయింది.

పొలం పనులున్నాయని చెప్పి వెంకటేశ్ రామవ్వను ఈ నెల7న తన బైక్ మీద తీసుకొచ్చాడు.సాయంత్రం అత్త ఇంటికి వెళ్లేప్పుడు బైక్ మీద డ్రాప్ చేయలేదు. దీంతో అత్త ఒంటిరిగా మసాన్ పల్లి శివారులో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. రామవ్వను వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అత్త ఇన్సురెన్స్ సొమ్ములతో జల్సాలు చేయాలనుకున్న వెంకటేశ్ కటకటాలపాలయ్యాడు.

Tags:    

Similar News