భారీ ధరలకు అమ్ముడుపోయిన టీజీ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్

కొత్త TG రిజిస్ట్రేషన్ ప్లేట్లు వాడుకలోకి రావడంతో, రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ద్వారా కొంత ఆదాయాన్ని దక్కించుకుంది.

Update: 2024-05-21 16:45 GMT

కొత్త TG రిజిస్ట్రేషన్ ప్లేట్లు వాడుకలోకి రావడంతో, రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ద్వారా కొంత ఆదాయాన్ని దక్కించుకుంది. సోమవారం ఖైరతాబాద్‌ లోని రీజనల్ ట్రాన్స్ పోర్ట్ సంస్థ (ఆర్‌టీఏ) కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం, అమ్మకాల ద్వారా రూ.43.70 లక్షలు వసూలు చేశారు.  

మార్చిలో నగరంలో ఫ్యాన్సీ టీజీ నంబర్ ప్లేట్ల వేలం ప్రారంభం కావడంతో ఆర్టీఏకు రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. వేలంలో తొలి టీజీ నంబర్ ప్లేట్ టీజీ 09 0001 రూ.9.61 లక్షలకు కొనుగోలు చేశారు. TS స్థానంలో TG కోడ్‌తో మోటారు వాహనాలను నమోదు చేసుకోవడానికి కేంద్రం మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది.

RTA అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలి రిజిస్ట్రేషన్ నంబర్ వేలం సమయంలో కొన్ని నెంబర్ ప్లేట్లు భారీ మొత్తంలో వేలం పలికాయన్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ TG 09 9999 వేలంలో రూ.25,50,002 కి కొనుగోలవ్వగా, TG 09A 0006 రూ.2.76 లక్షలకు అమ్ముడుపోయింది. TG 09 A 0005 అనే రిజిస్ట్రేషన్ నంబర్ రూ.1,80,200కి వేలం వేయగా, TG 09 A 0019 రూ.1,20,019 పలికింది. TG 09 A 0009 అనే నంబర్ రూ.1,10,009 వేలంలో పోయింది.

TG 09 9999 నంబర్‌కు సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ రూ.25,50,002 చెల్లించగా, రామకృష్ణ ఎర్రమనేని TG 09 A 0006ను రూ.2.76 లక్షలకు కొనుగోలు చేశారు. సిక్స్త్ అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ TG 09 A 0005కి రూ.1,80,200 చెల్లించగా, TG 09 A 0019ని యలమంచిలి గోపాల కృష్ణ రూ.1,20,019కి కొనుగోలు చేశారు. SK కార్లాంజ్ TG 09 A 0009 నంబర్‌ను రూ.1,10,009కి కొనుగోలు చేసింది.

కొంతమంది తమ వాహన రిజిస్ట్రేషన్‌ నెంబర్ లో వారి లక్కీ నెంబర్స్ ఉండేలా చూసుకుంటారని మనకి తెలిసిన విషయమే. మరికొందరు వారి పుట్టిన తేదీలు, వారి లైఫ్ లో స్పెషల్ ఈవెంట్స్ కి సంబంధించిన నంబర్‌ లను చేర్చుకుంటూ ఉంటారు. కాగా ఈ క్రమంలోనే నంబర్ ప్లేట్ టీజీ 09 0001 రూ.9.61 లక్షలకు కొనుగోలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

కాగా, గతేడాది జూన్ 3న (TS గా ఉన్నప్పుడు) ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రూ.35,62,691 ఆదాయం వచ్చింది. ఓ వాహన యజమాని 9999 నంబర్లకు రూ.21.6 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. వాహన యజమానులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే 9999, 0001, 0007, 0009 హాట్ పిక్స్‌గా కొనసాగుతున్నాయని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News