HCU భూములు ప్రభుత్వానివే: టీజీఐఐసీ

ప్రాజెక్ట్ను వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది.;

Update: 2025-03-31 08:14 GMT

కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్ర యూనివర్సిటీకి చెందిన భూములను ప్రభుత్వం వేలం వేస్తోందని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన చేరసింది. ప్రభుత్వం వేలం వేయాలని ఆలోచిస్తున్న ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని టీజీఐఐసీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో హెచ్‌సీయూ‌కు చెందని భూమి లేదని తేల్చి చెప్పింది. ‘‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ఈ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవు. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదు’’ అని పేర్కొంది.

‘‘ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాజెక్ట్ను వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 400ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది" అని టీజీఐఐసీ పేర్కొంది.

Tags:    

Similar News