సీపీ కార్యాలయం దగ్గర డీసీపీపై హత్యాయత్నం..

దుండగులపై కాల్పులు జరిపిన డీసీపీ సాయి చైతన్య.

Update: 2025-10-25 12:28 GMT

హైదరాబాద్ సౌత్-ఈస్ట్ డీసీపీ సాయి చైతన్యపై ఓ దుండగుడు హత్యాయత్నం చేశాడు. సీపీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డీసీపీ చైతన్య హాజరయ్యారు. మీటింగ్ ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను ఆయన గుర్తించారు. వెంటనే వారిని పట్టుకోవడం కోసం డీసీపీ సాయి చైతన్య, అతని గన్‌మ్యాన్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే దొంగల్లో ఒకరు.. తన దగ్గర ఉన్న కత్తితో డీసీపీపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో కిందపడిపోయిన డీసీపీ వెంటనే తేరుకుని దొంగలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో  ఒకడికి గాయాలయ్యాయి. అతడిని నాంపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో జరిగింది.

Tags:    

Similar News