ఈఎస్ఐ ఆసుప్రతిలో ప్రమాదం

ముగ్గురు కార్మికులు మృతి

Update: 2025-11-24 12:09 GMT

హైదరాబాద్‌ సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుప్రతిలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈఎస్ఐలో ఎమర్జెన్సీ వార్డు పునఃనిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేస్తున్న క్రమంలో సెంట్రింగ్ ఒక్కసారిగా కూలింది. దాంతో దానిపై నిల్చుని పని చేస్తున్న కార్మికులు కిందపడిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు కార్మికులు శ్లాబ్ పెచ్చుల కింద పడిపోయారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. సహాయక సిబ్బంది.. ఆ పెచ్చులను తొలగించి కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుల కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Tags:    

Similar News