తెలంగాణా-ఏపీ మధ్య ‘తిరుమల’ కొత్త పంచాయితి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదాం ముగియకముందే మరో కొత్త పంచాయితి మొదలయ్యింది. తాజా పంచాయితి ఏమిటంటే దర్శనాల గురించి.

Update: 2024-10-24 05:17 GMT
Telangana TTD and AP

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదాం ముగియకముందే మరో కొత్త పంచాయితి మొదలయ్యింది. తాజా పంచాయితి ఏమిటంటే దర్శనాల గురించి. తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమల తిరుపతి దేవస్ధానం(Tirumala Tirupati Devasthanams) అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. తమ సిఫారసులేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవటంలేదని నియోజకవర్గాల్లో జనాలు చెప్పుకోవటాన్ని ఎంఎల్ఏ(MLAs)లు చాలా అవమానంగా భావిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే టీటీడీ(TTD) అధికారులు తమను అవమానిస్తున్నారని ఎంఎల్ఏలకు బాగా మండుతోంది. అందుకనే ఈ విషయాన్ని ప్రిస్టేజిగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(RevanthReddy)తో ఫిర్యాదు చేయాలని కొందరు ఎంఎల్ఏలు అనుకుంటున్నారు. తమ సిఫారసు లేఖలకు తిరుమల దర్శనాలు, కాటేజీలు, సేవల టికట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇప్పించేట్లుగా రేవంత్ తో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు చెప్పించి టీటీడీ ఈవో(TTD Eo)తో పాటు తిరుమల అధికారులకు ఆదేశాలు ఇప్పించాలని తెలంగాణా(Telangana) ఎంఎల్ఏలు ఆలోచిస్తున్నారు.

ఇదే విషయమై కాంగ్రెస్ ఎంఎల్ఏలు యెన్నం శ్రీనివాసరెడ్డి(Yennam SrinivasaReddy), జనపల్లి అనురుధ్ రెడ్డి(Janapalli Anirudh Reddy), ఎంఎల్సీ బాల్మూరి వెంకట్(Balmuri Venkat) టీటీడీ ఉన్నతాధికారులపై మండిపోతున్నారు. జడ్చర్ల(Jadcharla) ఎంఎల్ఏ జనపల్లి ‘ది ఫెడరల్ తెలంగాణా’ తో మాట్లాడుతు తిరుమల అధికారులు తమను తీవ్రంగా అవమానిస్తున్నట్లు మండిపోయారు. తమ లేఖలను తిరుమలలో పట్టించుకోనపుడు ఏపీ(AP) వాళ్ళు హైదరాబాద్(Hyderabad) లో ఎలాగుంటారు ? ఎలా వ్యాపారాలు చేస్తారో చూస్తామని హెచ్చరించారు. చంద్రబాబునాయుడుకు హైదరాబాద్ లో వ్యాపారాలుండాలి, ఇళ్ళుండాలి కాని తెలంగాణా ఎంఎల్ఏలను తిరుమలలో అవమానిస్తారా అంటు నిలదీశారు. తెలంగాణా ఎంఎల్ఏల సిఫారసు లేఖలను తిరుమలలో పట్టించుకోవటంలేదంటే తమను అవమానిస్తున్నట్లుగానే భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో తమకు ఇంత అవమానం జరుగుతున్నపుడు ఏపీ వాళ్ళు మాత్రం తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో ఎలాగ వ్యాపారాలు చేసుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ఏపీ నేతలను తెలంగాణాలోకి అడుగుపెట్టనీయమని తాము అడ్డంతిరిగితే వాళ్ళకు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించాలని కూడా చెప్పారు.

దేవుడి దగ్గర అందరు సమానమే అయితే తమ సిఫారసు లేఖలను తిరుమలలో ఎందుకు పట్టించుకోవటంలేదని ప్రశ్నించారు. తమ నియోజకవర్గం నుండి ఎంతోమంది తిరుమల శ్రీవారి దర్శనాలకు వెళుతుంటారని చెప్పారు. వారంతా తమను సిఫారసు లేఖలు అడుగుతుంటారని తామిచ్చిన లేఖలకు తిరుమలలో ఎలాంటి విలువ లేదంటే నియోజకవర్గం ప్రజల ముందు తమ పరిస్ధితి ఎలాగుంటుందో ఆలోచించాలన్నారు. ఇదంతా తాను కోపంతో అనటం లేదని బాధతోనే చెబుతున్నట్లు ఎంఎల్ఏ చెప్పారు.

ఇదే విషయాన్ని మహబూబ్ నగర్(MahaboobNagar) ఎంఎల్ఏ యెన్నం మాట్లాడుతు తెలంగాణా ఎంఎల్ఏలను తిరుమలలో బాగా అవమానిస్తున్నట్లు చెప్పారు. తిరుమలకు వెళ్ళేవాళ్ళకి తామిచ్చిన సిఫారసు లేఖలను పట్టించుకోవటంలేదంటే తమను అవమానించినట్లే అన్నారు. ఎంతోమంది తిరుమల శ్రీవారి దర్శనాలకు వెళ్ళేటపుడు సిపారసు లేఖలను అడుగుతుంటారని గుర్తుచేశారు. తామిచ్చిన లేఖలను పట్టించుకోవటంలేదంటే తమను అవమానించినట్లుగానే తాము ఫీలవుతున్నట్లు యెన్నం చెప్పారు. ఇదే విధమైన భావన చాలామంది ఎంఎల్ఏల్లో ఉందని ఎంఎల్ఏ చెప్పారు. తొందరలోనే ఈ విషయాన్ని రేవంత్ దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబుతో మాట్లాడించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణా ఎంఎల్ఏల సిఫారసు లేఖలను పట్టించుకోమని టీటీడీ ఈవో చేసిన ప్రకటనను ఎంఎల్ఏ తప్పుపట్టారు. చంద్రబాబుతో రేవంత్ మాట్లాడిన తర్వాత కూడా తిరుమలలో తమ లేఖలను పట్టించుకోకపోతే ఏమి చేయాలో ఎంఎల్ఏలందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని యెన్నం చెప్పారు.

ఎంఎల్సీ(MLC) బాల్మూరి మాట్లాడుతు టీటీడీ అధికారులపై మండిపోయారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమ లేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవటంలేదని ఆరోపించారు. తమ సిఫారసు లేఖలకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వనపుడు ఆ విషయాన్ని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసన్నారు. తొందరలోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. ఏపీ వాళ్ళకు ఆస్తులు, వ్యాపారాలకు తెలంగాణా, హైదరాబాద్ కావాలి కాని తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను మాత్రం తిరుమలలో పట్టించుకోరా ? అని మండిపోయారు. తమకు తిరుమలలో ఎందుకు ప్రోటోకాల్(Protocol) ఇవ్వరో తేల్చుకుంటామని ఆవేశంగా చెప్పారు.

Tags:    

Similar News