ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే తిరగబడాలి: కవిత
మహబూబ్ నగర్ జిల్లా కేశం పేట మండలంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభం;
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు సాధన కోసం ప్రజలు తిరగబడాలని బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను మరచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కాకనూరు గ్రామంలో పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్బంగా కవిత ప్రసంగించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ప్రతీ ఒక్కరూ లెటర్లు రాసి పోస్ట్ కార్డ్ ఉద్యమం బలపరచాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను సోనియా గాంధీకి గుర్తు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని అన్నారు. అడగనిది అమ్మ అయిన అన్నం పెట్టదు రేవంత్ రెడ్డి అసలే పెట్టడని కవిత వ్యాఖ్యానించారు . మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి మగాళ్లకు బస్సులే లేకుండా చేశాడని కవిత ఎద్దేవా చేశారు.